దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడం బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ ను అరికట్టేందుకు చైనా ఇప్పటికే వ్యాక్సిన్ ను సిద్ధం చేసింది. వ్యాక్సిన్ తొలి దశ ట్రయిల్స్ రెండు వారాల క్రితం చైనాలో మొదలయ్యాయి. 
 
కరోనా వైరస్ పుట్టకకు కేంద్రమైన వుహాన్ లోనే ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. చైనా పరిశోధకులు పరిశోధనల ఫలితాలు వెలువడిన తరువాత విదేశాల్లో ట్రయిల్స్ వేసేందుకు యోచిస్తున్నారు. చైనీస్ అకాడమీస్ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యుడు చెన్ వీ ఈ నెలలోనే పరిశోధన ఫలితాలు వెలువడతాయని... చైనాలో ఉన్న విదేశీయులపై కూడా వ్యాక్సిన్ ను ప్రయోగిస్తామని తెలిపారు. 
 
తొలి దశ ఫలితాల్లో వ్యాక్సిన్ మంచి ప్రభావం చూపిస్తే అంతర్జాతీయ దేశాల సాయంతో విదేశాల్లో కూడా ఈ మందుపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని అన్నారు. చైనాకు చెందిన ఒక ప్రభుత్వ పత్రిక ఈ విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం చైనాలో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ ను త్వరలోనే కరోనా ప్రభావిత దేశాల్లో వాడవచ్చని చైనా చెబుతోంది. 
 
కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయంగా సహకరించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని చెన్ వీ తెలిపారు. చైనా కరోనా విషయంలో నిజాలను దాచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కరోనా బాధితుల సంఖ్య 1618కు చేరగా 52 మంది మృతి చెందారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటివరకూ 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 58 కేసులు నమోదయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: