రానున్న రోజుల‌న్నీ కూడా చాలా గ‌డ్డు రోజులేన‌ని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. ప్ర‌పంచంలోని ప్ర‌తీ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొబోతున్నాయంటూ పేర్కొన్నారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత ఈ స్థాయి మాంద్యాన్ని ఎప్పుడూ చూసి ఉండ‌ర‌ని వాపోయారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌తీదేశాన్ని క‌కావిక‌లం చేసింద‌ని,సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డానికి, ఈ ప్ర‌ప‌చం మాములు స్థితికి చేరుకోవాడానికి, ఆర్థిక రంగం గాడిన ప‌డ‌టానికి చాలా కాల‌మే ప‌డుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.   ఐరాస 75 ఏళ్ల చరిత్రలో ఈ స్థాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని నివేదిక అభిప్రాయపడింది. ఇది కేవలం ఆరోగ్య రంగానికే పరిమితం కాకుండా మానవ సంక్షోభానికి కూడా దారితీస్తుందని హెచ్చ‌రించింది.


మానవాళిని పట్టిపీడిస్తున్న కొవిడ్‌-19, ఆర్థిక రంగంపై దాని ప్రభావం అత్యంత అస్థిరత, అశాంతి, ఆందోళనలకు దారితీయబోతోందని చెప్పుకొచ్చారు. ‘సామాజికార్థిక పరిస్థితులపై కొవిడ్‌-19 ప్రభావం’పై నివేదిక విడుదల సందర్భంగా ఆంటోనియా ఈ వ్యాఖ్యలు చేశారు.  కొవిడ్‌-19ని ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యల్లో ఇంకా చాలా వెనకబడి ఉన్నామని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌రిహ‌ద్దులు గీసుకుని వ్యాధి క‌ట్ట‌డికి కృషి చేస్తున్నార‌ని, అలా కాకుండా ప్ర‌తీ దేశం వ్యాధి నిర్మూల‌న‌కు స‌మైక్య‌త‌తో ఎదుర్కొనేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాల్ని ఖాతరు చేయడం లేదని ఆయ‌న  ఆందోళన వ్యక్తం చేశారు. 


ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు సమూకూర్చుకోలేని దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు అండగా నిలవాలని కోరారు. అలా అయితే ఒక దేశం నుంచి మ‌రో దేశానికి క‌రోనా మ‌హమ్మారి ప్ర‌బ‌ల‌కుండా  చూడ‌గ‌ల‌మ‌న్న నిజాన్ని అన్ని దేశాలు గ్ర‌హించాల‌న్నారు. ఇప్ప‌టికే క‌రోనా విష‌యంలో ప్ర‌పంచ దేశాలు ఆల‌స్యంగా మేల్కొన్నాయి. ఇప్ప‌టికైనా పోరును ఉధృతం చేయాలి. అందుకు అత‌ర్జాతీయ వేదిక‌గా అన్ని దేశాలు ఏక తాటిపైకి రావాల‌ని అన్నారు.  ముఖ్యంగా రాజకీయ పంతాలకు పక్కనబెడితేనే ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రించారు. డ‌బ్ల్యూహెచ్‌వో ఇప్ప‌టికే అన్ని దేశాల‌తో నిధిని ఏర్పాటు చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: