అందరి ప్రసంశలను అందుకుంటున్న గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్ధపై పచ్చమీడియా బురద చల్లే కార్యక్రమం మొదలుపెట్టినట్లే ఉంది. కరోనా వైరస్ నియంత్రణ, వైరస్ బాధితులను గుర్తించే క్రమంలో వాలంటీర్ల వ్యవస్ధ నిజంగా బాగా పనిచేస్తోందనే చెప్పాలి. విదేశాల నుండి వచ్చిన వారి వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించటంలో వాలంటీర్లు తమ శక్తికి మించి పనిచేస్తున్నారు. ఇందుకే దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు బ్రిటన్, ఇండోనేషియాలు కూడా ఈ వ్యవస్ధ పనితీరును అభినందించాయి.

 

ఈ నేపధ్యంలో వాలంటీర్ల వ్యవస్ధను గబ్బు పట్టించేందుకు టిడిపి, పచ్చమీడియా మైండ్ గేమ్ మొదలుపెట్టింది. మొదటి నుండీ ఈ వ్యవస్ధను చంద్రబాబునాయుడుతో  పాటు పచ్చమీడియా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం అందరూ చూసిందే.  హఠాత్తుగా ఎదురైన కరోనా వైరస్ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి అండగా వాలంటీర్లు చిత్తశుద్దితో పనిచేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇటువంటి వ్యవస్ధపై బురద చల్లి పచ్చమీడియా తన పైశాచిక ఆనందం పొందుతోంది. అసలు వాలంటీర్ల వ్యవస్ధ ఏమీ పనిచేయటం లేదని, ఆశా వర్కర్లు చేస్తున్న పనిని వాలంటీర్ల వ్యవస్ధ ఖాతాలో వేస్తున్నారంటూ ప్రచారం మొదలుపెట్టింది. అంటే వాలంటీర్ల వల్ల జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రావటాన్ని చంద్రబాబు, పచ్చమీడియా తట్టుకోలేకున్నారు.

 

ఇంటింటికి సరుకులు అందివ్వలేని వాలంటీర్లు కరోనా వైరస్ ను గుర్తించే పని చేస్తున్నారనటం అబద్ధమే అన్న పద్దతిలో ఓ కథనాన్ని అచ్చేయటం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేషన్ ద్వారా ఇచ్చే సరుకులను వాలంటీర్ల ద్వారా ఇంటికే అందించాలంటూ కొద్ది రోజులుగా చంద్రబాబునాయుడు, లోకేష్ మంత్రులు పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. ఈ డిమాండ్ ను పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొట్టి పడేశారు.

 

వైరస్ గుర్తించే పనిలోనే బిజీగా ఉన్న వాలంటీర్లతో సరుకులు పంపిణి చేయించటం సాధ్యం కాదన్నారు. జనాలే చౌకదుకాణాలకు వచ్చి సరుకులు తీసుకోవాలని తేల్చేశారు. అంటే చంద్రబాబు డిమాండ్ ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్న మంట పచ్చమీడియాలో బయలుదేరినట్లుంది. వాలంటీర్ల ద్వారా సరుకులను ఇళ్ళకే సరఫరా చేయించాలంటే మళ్ళీ ఈ విషయమై గబ్బు పట్టించేందుకు టిడిపి, పచ్చమీడియా ఇంకేదో ప్లాన్ వేసినట్లే అనుమానంగా ఉంది. జనాలే రేషన్ షాపులకు వచ్చి సరుకులు తీసుకుంటే సరుకులు ఇవ్వటం లేదని ఆరోపణలు చేసే అవకాశం ఉండదు. అందుకని ఏకంగా వాలంటీర్ల వ్యవస్ధపైనే బురద చల్లే కార్యక్రమం మొదలుపెట్టినట్లుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: