కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో మందుబాబుల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రతిరోజూ మద్యం సేవించేవారు లాక్ డౌన్ వల్ల మందు దొరక్కపోవడంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మద్యానికి పూర్తిగా బానిసైన వారిలో ఒకరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కొందరు మందుబాబులు వింతగా ప్రవర్తిస్తూ ఉండటంతో వారి కుటుంబ సభ్యులు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. 
 
ప్రతిరోజు వందకు పైగా కేసులు నమోదవుతున్నట్టు ఎర్రగడ్డ ఆస్పత్రి సూపరిండెంట్ ఉమా శంకర్ తెలిపారు. నిన్న ఒక్కరోజే ఆస్పత్రికి 198 మందిని వారి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. వీరిలో 101 మందికి వైద్యం చేసి పంపించామని.... మిగిలిన 97 మందిని ఆస్పత్రిలో చేర్చుకున్నామని సూపరిండెంట్ తెలిపారు. ప్రతిరోజూ మద్యం తాగేవారికి ఒక్కసారిగా మందు దొరక్కపోవడంతో ఈ సమస్య వస్తోందని తెలిపారు. 
 
ఆస్పత్రిలో చికిత్స అనంతరం చాలామంది కోలుకుంటున్నారని... మద్యాన్ని పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికి మంచిదని కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నామని అన్నారు. అధిక సంఖ్యలో ఆస్పత్రికి రోగులు వస్తూ ఉండటంతో వైద్యుల కొరత వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. 
 
దేశంలో నిన్న ఒక్కరోజే 317 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1600 దాటిందని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజుల నుంచి కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటివరకూ 97 కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో 58 కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నాయి. కొత్త కేసులు నమోదు కాకుండా తగిన చర్యలు చేపడుతున్నాయి. 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: