ఇంతకీ అసలేమిటీ తబ్లీగీ జమాత్ అనే సందేహం మనలో అనేకమందికి కలగక మానదు..! తబ్లిగి అంటే... అల్లా మాటలను బోధించే వారని అర్ధం. ఇక జమాత్ అంటే, సంస్థ. అందుకే దీన్ని "తబ్లిగి జమాత్" గా పిలుస్తారు. అలాగే ఆ ప్రత్యేక స్థలాన్ని మర్కజ్ అని పేర్కొంటారు. ఈ కార్యక్రమం జరిగిన ముస్లిం సంస్థ ప్రధాన కార్యాలయం నిజాముద్దీన్‌లో ఉంది. అయితే ఈ కార్యక్రమానికి వేలమంది ఇటీవల హాజరవ్వడం ఇపుడు పలు చర్చలకు దారి తీస్తోంది.

 

కరోనా వైరస్ ప్రబలడంతో భారత దేశం మొత్తం లాక్‌డౌన్ పాటిస్తున్న తరుణంలో మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి, జనం భారీ సంఖ్యలో అక్కడ హాజరయ్యారు. అదే ఇపుడు అందరిలోనూ పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అయితే, వారు జనతా కర్ఫ్యూ ప్రకటించగానే సదరు కార్యక్రమం నిలిపివేశామని, కానీ పూర్తిగా లాక్‌డౌన్ ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో ఉన్న వారు... తిరిగి స్వస్థలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.. కానీ వారి మాటలు అంత నమ్మశక్యంగా లేవని పలువురి వాదన..! 

 

ఇకపోతే... ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలా మందికి కరోనా వైరస్ నిర్ధారణ అవ్వడం అందరికీ తెలిసినదే. ఆ కారణంగానే మన ఇరు తెలుగు రాష్ట్రాలలో కేసుల సంఖ్య ఒక విధంగా రెట్టింపు అయిందని చెప్పుకోవాలి. అందరూ... త్వరలోనే లాక్ డౌన్ క్లోజ్ అవుతుందనే ధీమాతో వున్న తరుణంలో ఇపుడు ఈ తబ్లిగి జమాత్ అందరిలోనూ కలవరాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. దిల్లీ పోలీసులు నిజాముద్దీన్ మొత్తం ప్రాంతాన్ని సీజ్ చేశారు. 

 

ఇక ఎలాంటి అనుమతులు లేకుండానే జనం భారీసంఖ్యలో అక్కడ సమావేశం అవ్వడం అందరిలోనూ... పలు అనుమానాలకు దారి తీస్తోంది. అయితే దానికి కారణాలు లేకపోలేదు... ఈ కార్యక్రమం పైన 2011లో వికీ లీక్స్ తీవ్రమైన ఆరోపణలు చేసింది.. అదేమంటే... కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ "ఆల్ ఖైదా"తో దీనికి సత్సంబంధాలు ఉన్నాయని ప్రకటించడం... అప్పట్లో పెను దుమారాన్నే రేపింది... అయితే దాన్ని వారు ఖండించడం కొసమెరుపు... ఇపుడు ఇలాంటి వార్తలనే పలువురు తెరపైకి తెస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: