కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ను విధించాయి. అందులో భాగంగా కల్లు దుకాణాలు, వైన్స్, బార్‌లు మూసివేయడంతో మందు బాబులకు కష్టాలు మొదలు అయ్యాయి. దాంతో మద్యం ప్రియులకు ఇది కఠినంగా మారింది.. చుక్క.. ముక్క లేని జీవితం ఎందుకుని పిచ్చెక్కిపోవడం.. ఉన్మాధులుగా మారడం.. ఆసుపత్రి పాలు కావడం జరుగుతుంది.  ఆ మద్య ఓ కార్మికుడు మేడపై నుంచి దూకి చనిపోయాడు.  ఇక మద్యం దొరకడం లేదని.. కొంత మంది వ్యక్తులు చేసిన దిక్కుమాలిన ప్రయోగం ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చింది. 

 

ఆరుగురు మిత్రులు కలిసి మద్యం తయారు చేసుకున్నారు. అది సేవించి ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ కారణంగా మద్యం  తయారు చేయాలని ప్లాన్ చేశారు.   వైల్పూరుకు చెందిన ధర్నల నవీన్ మూర్తి (22), అల్లాడి వెంకటేష్, కావలిపురానికి చెందిన పండూరి వీరేశ్, తణుకు దుర్గారావు, వెంకట దుర్గప్రసాద్, విప్పర్తి శ్యాంసుందర్ ఆదివారం విందు చేసుకుందామని అనుకున్నారు. 

 

ఐసోప్రొఫైల్ ఆల్కహాల్, దానిలో గ్లిజరిన్, హైడ్రో పెరాక్సైడ్ కలిపి మందు తయారు చేశారు ఆదివారం రాత్రి వారంతా దాన్ని సేవించారు. ఇంటికి వెళ్లారు.. ఆ తర్వాత దాని ఎఫెక్ట్ తీవ్రంగా పడింది.  తర్వాత ఐసోప్రొఫైల్ ఆల్కహాల్, దానిలో గ్లిజరిన్, హైడ్రో పెరాక్సైడ్ కలిపి మందు తయారు చేశారు ఆదివారం రాత్రి వారంతా దాన్ని సేవించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: