ప్రస్తుతం ప్రపంచం యెక్క రూపు రేఖల్ని మార్చేస్తున్న మహమ్మారి కరోనా గురించి యెంత చెప్పుకున్న తక్కువే.. అని చెప్పాలి. ప్రజలు వివిధ రకాలైన ఇబ్బందులతో కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు... ఇక రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులు భీభత్సమైన కలవరాన్ని అందరిలోనూ రేకెత్తిస్తున్నాయి. అంత సవ్యంగా ఈ లాక్ డౌన్ పూర్తవుతుందనుకునే సరికి, నిన్న నమోదైన కేసులు తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి.

 

ముఖ్యంగా మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల  ఢిల్లీ లో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమం పుణ్యమాని... ఒక్కసారిగా... కోవిడ్ - 19 కేసులు రెట్టింపు సంఖ్యకు చేరుకున్నాయి. అలాగే లాక్ డౌన్ చాలా సీరియస్ గా దేశంలో అమలు అవుతున్న వేళ.... వలస కార్మికుల గుంపులు కూడా... చాలా నిరాశ, నైరాశ్యానికి గురి చేస్తున్నాయి... పరిస్థితులు చూస్తుంటే.... ప్రస్తుతం అమలులో వున్న లాక్ డౌన్ మరో నెలరోజులు పెరిగే అవకాశం వున్నదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

 

జనాలలో యెంత అవేర్నెస్ క్రియేట్ చేసినా ఉపయోగం లేకుండా పోతుందని... కొందరు వైద్య నిపుణులు వాపోతుండటం మనం చూస్తూనే వున్నాం... ఇక దేశ వ్యాప్తంగా చూసుకుంటే.. పలు చోట్ల, బాధ్యతగా ఉండాల్సిన యువకులే.... నాలుగు గోడల మధ్య ఇమడలేక, వాహనాలతో రోడ్లమీద చక్కెర్లు కొడుతుండటం... వారిని పోలీసు శాఖవారు వారించో... కొట్టో... తిరిగి వెనక్కి పంపుతున్న వీడియోలు మనం చూస్తూనే వున్నాం.... ఇక ప్రపంచం వ్యాప్తంగా.. నమోదైన కేసుల వివరాలివి.....

 


ప్రపంచలో మొత్తం కేసులు: 8, 59, 338
మరణాలు: 42, 334
రికవరీ కేసులు: 1, 78, 125

 

ఇండియాలో మొత్తం కేసులు: 1657 
మరణాలు: 50 
కొత్త కేసులు: 193
రికవరీ కేసులు: 150 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 92
మృతులు: 8 
కొత్త కేసులు: 1 
యాక్టివ్ కేసులు: 61 
డిశ్చార్జి కేసులు: 14
ఏపీలో మొత్తం కేసులు: 44
మృతులు: 0

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: