ప్రపంచం అంతా కరోనా వైరస్ భయం పుట్టిస్తుంది.  మన దేశంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఎక్కడి జనం అక్కడే ఉండిపోయారు.  ఈ నేపథ్యంలో ఒక మనిషిన మరో మనిషి తాకాలంటేనే భయపడిపోతున్నారు.  ఇలాంటి కష్ట కాలంలో తన విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడిపై ప్రజలు పూల వాన కురిపించారు.  కరోనా వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తున్న వేళ, తాను పని చేస్తున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని శ్రమిస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడిపై పూలవరం కురిపించిన స్థానికులు, అతని మెడలో డబ్బుల హారాలను వేసి, అతని సేవలను కొనియాడారు. 

 

పంజాబ్ లో ఓ చెత్త కార్మికుడు తన రిక్షాతో రావడం... చెత్త సేకరించి తీసుకు వెళ్లడం చూసి అక్కడి ప్రజలు సంతోషంతో అతనిని మెచ్చుకుంటూ పూల వాన కురిపించారు.  ఓ వ్యక్తి అతనికి డబ్బుల దండ వేశాడు. ఈ ఘటన పంజాబ్‌ లోని పటియాల జిల్లా నభా ప్రాంతంలో జరుగగా, ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

క్రమం తప్పకుండా తమ వీధిలోకి వచ్చి చెత్తను సేకరించే ఓ పారిశుధ్య కార్మికుడు, లాక్ డౌన్ అమలులో ఉన్నా, తన విధులను మాత్రం మీరలేదు. నిజంగా మన దేశం ఇంత గొప్పది కనుకనే ఇతర దేశాలకు ఆదర్శం అంటున్నారు.  ఆ మద్య ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ ’ దిగ్విజయంగా పూర్తి చేసి అందరూ ఐదు గంటలకు చప్పట్లు కొట్టారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: