ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా భారతదేశం మొత్తం లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా లాక్ డోన్ విధానాన్ని అమలు చేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీనితో ప్రజలు అంతా ఇంటికి వరకే అంకితం అయిపోయారు. లాక్ డౌన్ అమలు అవ్వడం వల్ల ప్రజా రవాణా సంస్థలు అన్నీ కూడా మూతపడ్డాయి. లాక్ డౌన్ అమలు వల్ల వలస వచ్చిన కార్మికులు అంతా కూడా తమ గ్రామాలకు నడక దారిన పోవడం కూడా అనేక చోట్ల రోజు చూస్తున్నాం. ఇందుకు ఫలితంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతోంది.

 

 


ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీ, గురుగ్రామ్ లో లాక్ డౌన్ సమయంలో ప్రయాణించడానికి  సులువు తరంగా ఉండడం కోసం వెబ్ సైట్స్ ని ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీ ప్రభుత్వం http://epass.jantasamvad.org అనే వెబ్ సైట్ ని మొదలు పెట్టారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఈ పాస్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ వంటి వివరాలు వాళ్లకు అందించాల్సి ఉంటుంది. ఇలా ఈ పాస్ కు అప్లై చేసుకోవడం ద్వారా రోజువారీ కూలీ కార్మికులకు ఆహారం, రేషన్ కోసం సహాయం కోరేందుకు కూడా ఇందులో అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు చేకూరుతుంది. 

 

 


ఇక గురుగ్రామ్ లో కూడా అలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం http://ggncurfewpass.in వెబ్ సైట్ ను ల్యాంచ్ చేయడం జరిగింది. అలాగే ఆ ప్రభుత్వం అత్యవసర సమయం, ముఖ్యమైన సమయాల్లో మాత్రమే ఈ పాసులు ప్రజలకు అందజేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. దీనితో ప్రజలకు కొంతమేర సహకారం అందుతుందని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: