భారతదేశం మొత్తం కరోనా వైరస్ వల్ల విలవిల్లాడిపోతుంటే, ఈ రాష్ట్రం మాత్రం ఆ మహమ్మారి బారిన పడకుండా ప్రశాంతంగా ఉంది. అవ్వడానికి పేద రాష్ట్రమే అయినా, ఇప్పుడు భారతదేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేని రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ రాష్ట్రమే జార్ఖండ్. అంతా బాగానే ఉంది కానీ, నలుగురు కురాళ్లు చేసిన పని వల్ల ఇప్పుడు ఆ రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అసలు ఏం జరిగిందో తెలిస్తే, ఎవరైనా అయ్యో పాపం అనాల్సిందే.

 

 

వివరాల్లోకి వెళ్తే, కొన్ని నెలల క్రితం జార్ఖండ్ రాష్ట్రంలోని పలామూ జిల్లాకు చెందిన నలుగురు కుర్రాళ్లు వేర్వేరు రాష్ట్రాల్లో పనులకు వెళ్లారు. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత, ఏదో ఒకరకంగా తంటాలు పడి తమ సొంతూరికి చేరుకున్నారు. వచ్చిన వాళ్లు లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ఇంట్లో ఉండకుండా ఊరంతా తిరగడం మొదలుపెట్టారు. అది చూసిన కాశీ షా అనే 45 ఏళ్ళ పెద్దాయన, లాక్ డౌన్ లో ఉండకుండా బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించాడు.  అందుకు ఆ నలుగురు కుర్రాళ్లూ కోపంగా చూశారు. వాళ్లలా చూస్తుంటే ఆ పెద్దాయనకు ఇంకా కోపం పెరిగింది. “మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆ రాష్ట్రాల్లో కరోనా ఉంది కాబట్టి, అది మీకు సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీకు మీరుగా ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉండాలి. అంతే కానీ ఇలా ఊరంతా తిరుగుతారేంటి?” అంటూ గట్టిగా అరిచాడు. అప్పటికే జనం ఇళ్ల నుండి బయటకు వచ్చి చూడసాగారు.

 

 

వాళ్ళందరినీ చూసే సరికి ఆ పెద్దాయనకు ధైర్యం వచ్చింది. ఆ నలుగురినీ ఇంకా గట్టి గట్టిగా తిట్టడం మొదలు పెట్టాడు. దాంతో ఆ నాలుగు కుర్రాళ్లలో ఇద్దరు, పక్కనే ఉన్న మందపాటి కర్రల్ని తీసుకుని ఆ పెద్దాయనను కొట్టడం ప్రారంభించారు. ఇంతలో మిగిలిన ఇద్దరు కుర్రాళ్లకు కర్రలు దొరక్కపోవడంతో, ఆయన కడుపులో పిడి గుద్దులు గుద్దారు. అటు కర్రలతో ఇటు చేతులతో పెద్దాయన్ని చితక్కొడుతుంటే, చుట్టూ చేరి చూస్తున్న వాళ్లు ఒక్కరూ ఆపడానికి రాలేదు. కాశీ షాను రక్తమొచ్చేలా కొట్టి, ఆ నలుగురూ అక్కడి నుండి పరారయ్యారు. కాసేపటికి అంబులెన్స్ అక్కడికి రావడంతో ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే చాలా రక్తం పోవడంతో కాశీ షా మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు FIR రాశారు కానీ ఆ కుర్రాళ్లను ఇంకా అరెస్టు చెయ్యలేదు. మొత్తానికి జార్ఖండ్‌లో వైరస్ లేకపోయినా, కరోనా కారణంగా ఓ వ్యక్తి  చనిపోవడం చాలా బాధాకరం.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: