ఏపీలో కరోనా బాధితుల సంఖ్య గడచిన 15 గంటల్లో భారీగా పెరిగింది. ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 87కు చేరింది. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా కేసుల వివరాలను వెల్లడించింది. నిన్నరాత్రి 9 గంటల నుండి ఇప్పటివరకు 43 కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో ఈరోజు నమోదైన కేసులే అత్యధికం కావడం గమనార్హం. 
 
ఈ ఒక్కరోజే కడప, పశ్చిమ గోదావరి జిల్లాలలో కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 15 కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. నిన్న మొత్తం 373 శాంపిళ్లను టెస్టులకు పంపించగా అందులో 330 నెగిటివ్ గా తేలాయి. నిన్నటివరకూ కరోనా ప్రభావం పెద్దగా కనిపించని ఏపీలో పరిస్థితి విషమంగా మారిపోయింది. ప్రజలు ఏ మాత్రం ఆలసత్వం వహించినా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలను కరోనా కమ్మేసింది. 
 
ఢిల్లీ మత సమావేశం ఏపీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సమావేశానికి హాజరైన వారికే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ ఉండటంతో ఏపీ సీఎం జగన్ కరోనాపై సమీక్ష నిర్వహిస్తున్నారు. జగన్ ప్రధానంగా కరోనా పాజిటివ్ కేసులు, భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 
 
ఏపీ నుంచి ఢిల్లీ సమావేశానికి 1042 మంది హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.  ప్రభుత్వం ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా ప్రజల సహకారం అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: