అగ్ర‌రాజ్యం అమెరికాను మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. దేశ వ్యాప్తంగా 1,88,578 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 4,054 మంది మృతి చెందారు. న్యూయార్క్ న‌గ‌రం ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. ఇక్క‌డ న్యూయార్క్‌లో మాత్ర‌మే ఏకంగా 76 వేల కేసులు న‌మోదు అయ్యాయి. అమెరికాలో న్యూయార్క్ త‌ర్వాత న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిచిగాన్‌, ఫ్లోరిడా, మసాచుసెట్స్, ఇల్లినాయిస్, వాషింగ్ట‌న్‌, లూసియానా, పెన్సీల్వేనియా, జార్జీయా, టెక్సాస్ రాష్ట్రాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి దూసుకు పోతోంది.

 

ఇక తెలుగు వారు ఎక్కువుగా ఉన్న న్యూజెర్సీ, న్యూ యార్క్.. డ‌ల్లాస్ త‌దిత‌ర లాంటి చోట్ల సైతం ఈ వైర‌స్ రెచ్చిపోతోంది. ఇక క‌రోనాను కంట్రోల్ చేసేందుకు అమెరికా ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా ఆగ‌డం లేదు. ఇక దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై ట్రంప్ మాట్లాడుతూ వ‌చ్చే రెండు వారాలు అమెరికా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. ఎంతో ధైర్యంతో ఉండాల‌ని లేనిప‌క్షంలో తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని దేశ ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. 

 

ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న‌ తీవ్ర‌త‌ను బ‌ట్టి సుమారు 2.40 ల‌క్ష‌ల మ‌ది ప్రాణాలు కోల్పోవ‌చ్చ‌ని తెలిపారు. ఇది తాను చెబుతున్నది కాద‌ని.. వైద్య నిపుణుల అంచ‌నా ప్ర‌కారం తెలిసిన చేదు నిజ‌మ‌ని పేర్కొన్నారు. ఇక క‌రోనాను గ‌తంలో వ‌చ్చిన ప్లేగు వ్యాధితో పోల్చారు. వ‌చ్చే రోజుల‌న్ని మ‌రింత క‌ఠిన‌త‌రంగా ఉంటాయ‌ని.. వీటిని ఎదుర్కోనేందుకు అమెరిక‌న్లు నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కూడా ట్రంప్ అమెరిక‌న్ల‌ను హెచ్చ‌రించారు. ఇక వ‌చ్చే నెల రోజులు కూడా ఎవ్వ‌రూ ఇళ్లు దాటి బ‌య‌ట‌కు రావొద్ద‌ని కూడా చెప్పారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: