ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ అనే మాట వినిపిస్తోంది. కరోనా వైరస్ కారణంగా అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ కారణంతో పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇది అంతా ఇలా ఉండగా తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దక్షిణ రాష్ట్రాలలో మత కలియిక కోసం ఢిల్లీకి వెళ్లి వచ్చిన సంఘటన అందరిలోనూ ఇప్పుడు కలకలం రేపుతుంది. దీనిని ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యకంగా వారి కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వారిని విజ్ఞప్తి చేసారు.  

 

 

 

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మత ప్రార్థనలకు వెళ్లిన వారంతా స్వతహాగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని మీడియా పూర్వకంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి అని తెలిపారు. అలాగే రెండు రోజుల క్రితం 24 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయని మరోసారి గుర్తు చేయడం జరిగింది. ప్రజలు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించ వద్దు అని బొత్స సత్యనారాయణ గారు కోరడం జరిగింది. కరోనా విషయానికి సంబంధించి సీఎం జగన్ ప్రతిరోజు సమీక్షలు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

 

 

 

అలాగే మంత్రి ముస్లింలు అందరూ కూడా తమ ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం అంజాద్ భాష అందజేసిన వినతి గురించి కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న బీద, బడుగు వర్గాల వారికి, ఆశ్రయం లేనివారికి ఆహార వసతి కల్పించాలని అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలి బాధతో ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వీటితో పాటు వైద్య ఆరోగ్య శాఖకు నిధుల కొరత వంటి సమస్యలు రాకుండా నిధులన్నీ విడుదల చేసిందని మంత్రి ఈ సందర్బంగా తెలిపారు.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple:  https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: