ప్రపంచాన్ని గజగజ లాడిస్తున్న కరోనా వైరస్ ఉన్న కొద్ది విజృంభిస్తోంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ యూరప్ మరియు అమెరికా దేశాలను అతలాకుతలం చేసింది. ఈ వైరస్ దెబ్బకి యూరప్ మరియు అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా వరకు దెబ్బతింది. ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ వ్యాప్తి చెందుతోంది. 21 రోజులపాటు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన గాని ఉన్న కొద్ది వైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా పగబట్టినటు కరోనా వైరస్ ఒకే కుటుంబంలో 25 మందికి సోకింది. వీరిలో రెండు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలో ఉంటున్న ఆ కుటుంబం సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చింది. ఉమ్మడి కుటుంబం.

 

ఈ నేపథ్యంలో ముందుగా ఆ కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్ సోకింది. మార్చి నెల 23న ఆ నలుగురికి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. దీంతో కుటుంబం మొత్తాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్‌కు పంపారు. అయితే క్వారంటైన్‌ లో ఏకంగా నలుగురికి కొనసాగడంతో ….మిగతా కుటుంబ సభ్యులకు ఆందోళన మొదలయింది. వాళ్ళంతా కోలుకోవాలని ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఆ నలుగురు కోలుకున్నారు. అంతలోనే మిగతా 21 మంది కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ తేలడంతో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు అంతా ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

 

ముఖ్యంగా 25 మంది ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చాలా తక్కువ స్పేస్ కలిగి ఉండటంతో ఇరుకు ఇరుకుగా బతకటం తో ఈ వైరస్ బాగా ప్రబలి నట్లు వైద్యులు చెపుతున్నారు. దేశంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: