కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ బారిన 8 లక్షలమందికిపైగా పడ్డారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా ఏకంగా 42 వేలమంది మృతి చెందారు. అలాంటి ఈ కరోనా వైరస్ స్పెయిన్, ఇటలీ, ఇరాన్, అమెరికా వంటి దేశాల్లో విలయతాండవం చేస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ భారత్ లో కూడా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఇంకా గత రెండు రోజుల నుండి అయితే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయ్. ఆ కరోనా పాజిటివ్ కేసులు చుస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అలా నమోదవుతున్నాయి. 

 

అయితే ఆ కేసులలో 90 శాతం ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికే రావడం ఆందోళనకు గురి చేస్తుంది. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల్లో వందలాది మంది పాల్గొనడం, వారిలో చాలామందికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో అన్ని రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. 

 

ఈ మత ప్రార్థనల్లో పాల్గొని, స్వస్థలానికి చేరుకున్న వారి గురించి అన్ని రాష్ట్ర ప్రభుత్వలు ఆరా తీస్తున్నాయి. దొరికిన వారిని దొరికినట్టుగా ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నాయి. అయితే ఈ మర్కజ్ మసీదు భవనాన్ని కాళీ చెయ్యాలని ఢిల్లీ పోలీసులు చెప్పారు.. మాత పెద్దలను స్టేషన్ కు పిలిపించి మరి చెప్పారు. కానీ వారు వినలేదు.. భవనం మూసివేయడానికి నిరాకరించారు. దాని ఎఫెక్ట్ ఏ ఇప్పుడు ఈ కరోనా వైరస్ పాజిటివ్. 

 

అయితే ఆ మర్కజ్ మసీదు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వేలమందికిపైగా ఉన్నారు.. అంతమంది ఉన్న భవనంలో ప్రస్తుతం వెయ్యిమందికి ఖాళీ చేయించామని.. ప్రస్తుతం వెయ్యి మంది మాత్రమే ఉన్నారంటూ మాత పెద్దలు సమాధానం ఇచ్చారు.. ఇప్పుడు ఆ మతపెద్దల నిర్లక్ష్యపు పనులే ఇలా కరోనా వైరస్ తో అందరిని ఇబ్బంది పెడుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: