భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఢిల్లీలో బయటపడ్డ సమావేశం గురించి తెలిసి అవాక్కయ్యారు. ఇప్పటి వరకూ పరిస్థితి బాగానే ఉందని.. మరొక రెండు వారాల్లో కరోనా ను పూర్తిగా దేశం నుండి తరిమికొట్టొచ్చు అని భావించిన ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. ఈ లోపల ఇళ్ళలో ఉన్నవారి పరిస్థితి రోజు రోజుకు మరీ హృదయవిచారకరంగా మారింది. ఇక మందుబాబుల పరిస్థితి అయితే వర్ణనాతీతం.

 

దాదాపు అన్ని పరిశ్రమలకు, విద్యా సంస్థలకు మరియు కార్మిక సంస్థలకు సెలవు ఇచ్చేయడంతో మద్యం, సిగరెట్లు దొరకక అలవాట్లు ఉన్నవారు అల్లాడిపోతున్నారు. ఇక మద్యం దొరకకపోవడంతో కొంతమంది అసలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాగే మరికొద్ది రోజులు కొనసాగితే మరికొన్ని ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం అని ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసిన మేఘాలయ ప్రభుత్వం మందుబాబులకు లిక్కర్ ను హోమ్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు వల్ల ఏమిటి అంటే ఈ మద్యం డెలివరీ పొందేందుకు డాక్టర్ రసీదు తప్పనిసరి.

 

ఇతను మద్యానికి బానిస అయిపోయాడు.... ఇక అది లేనిదే నేను బ్రతకలేడు అని డాక్టర్ నిర్ధారిస్తే మద్యం మీ ఇంటికి వస్తుంది అన్న మాట. అదీ కాకుండా కొంతమంది శరీరం మద్యానికి అలవాటు పడిపోతుంది. వారికి రోజులో ఆ టైమ్ కి మద్యం దొరకకపోతే విపరీతమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు కూడా 21 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో డాక్టర్ రాసిచ్చిన రసీదును అప్ లోడ్ చేసి అన్ని ఆర్డర్ చేసుకోవచ్చు.

 

మరోవైపు కేరళ రాష్ట్రంలో ఇలా మద్యం దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. మూడు రోజుల్లో ఆరుగురు యువకులు ఇలా సూసైడ్ చేసుకున్నారు. దీంతో వీరి కోసం డాక్టర్ రసీదు ద్వారా ఫారిన్ లిక్కర్‌నుఔషధంగాసరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: