ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ మనదేశంలో కొంచెం నిదానంగానే మసులుకుంటోంది అనే చెప్పాలి. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది అంటున్నారు ఇప్పుడు ఆరోగ్యనిపుణులు. మొత్తం 130 కోట్ల మంది భారతీయుల్లో కనీసం 100 కోట్ల మందికి ఎడమ చేతి పై భాగాన భుజానికి సమీపంలో ఒక గుండ్రని మచ్చ కనిపిస్తుంది. ఇప్పుడు భారతీయులను అదే మచ్చ కరోనా బారి నుండి కాపాడుతుంది అంటున్నారు పరిశోధకులు.

 

ఆ గుండ్రటి మచ్చ ఉందని అందరికీ తెలుసు కానీ అది ఎప్పుడు ఎందుకు వేసుకున్నారో కొంతమందికి సరిగ్గా గుర్తు ఉండి ఉండదు. చిన్నప్పుడు మన ఇంట్లోని వారు వేయించిన బిసిజి టీకా గుర్తు అది. భారత్ లో బిసిజి టీకా వేయించుకొని వారు దాదాపుగా ఉండరు. ప్రభుత్వం తప్పనిసరిగా క్షయ వ్యాధి రాకుండా చిన్నతనంలోనే వేసే ఈ టీకా వల్లే కరోనా మరణాలు భారత్ లో మరణాలు తగ్గాయి అంటున్నారు పరిశోధకులు.

 

విషయం ఏమిటంటే ఈ బీసీజీ వ్యాక్సిన్ క్షయ వ్యాధి నివారణకు మాత్రమే కాకుండా కాకుండా శరీరంలో కి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు వాటికి అడ్డుగోడలా నిలుస్తుంది. మన రోగనిరోధక శక్తి తోడుతో ఈ వ్యాక్సిన్ ఆ వైరస్ తో పోరాడి దాన్ని వ్యాప్తి చెందకుండా ఆదిలోనే చంపేస్తుంది అని.... అందుకే భారతీయుల్లో కరోనా సోకిన వ్యక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉందని పరిశోధకులు అంటున్నారు.

 

కోవిడ్-19 మరణాలు అత్యధికంగా చోటుచేసుకుంటున్న ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో చాలాకాలం కిందటే బీసీజీ టీకాలను మధ్యలోనే నిలిపివేయడం కానీ, అసలు వేయకపోవడం కానీ జరిగిందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయం తెలుసుకున్న తర్వాత బీసీ కరోనా వైరస్ ని చంపుతుంది పరిశీలించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: