ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు కొత్త భయం పట్టుకుంది. ఒక్కరోజులో రెండు రాష్ట్రాల్లో సీన్ మారిపోయింది. సీఎం కేసీఆర్ ఏప్రిల్ 7వ తేదీ లోపు రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి వస్తాయని చెప్పినప్పటికీ ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 98కు చేరింది. ఏపీలో మొదట్లో కరోనా కేసులు పెద్దగా నమోదు కాకపోయినా నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 43 కేసులు నమోదు కావడంతో పరిస్థితి మారిపోయింది. 
 
ఏపీలోని పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో నిన్నటివరకు ఒక్క కేసు నమోదు కాలేదు. కానీ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు, కడప జిల్లాలో 15 కేసులు నమోదు కావడంతో ఈ రెండు జిల్లాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రెండు రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరగటానికి ఢిల్లీలో జరిగిన మత సదస్సే కారణం కావడంతో ఈ సదస్సు నిర్వాహకులను, వైరస్ వ్యాప్తికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. 
 
ఢిల్లీ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 2000 మందికి పైగా రావడంతో రెండు రాష్ట్రాలలో పరిస్థితి అదుపులో లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ఢిల్లీ సదస్సుకు హాజరైన వారి కోసం జల్లెడ పడుతున్నారు. పోలీసులకు కేవలం హైదరాబాద్ నుంచే 600 మంది ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 
 
అధికారులు ఇప్పటికే గుర్తించిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి వెంటనే పరీక్షలు జరుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ సదస్సుకు ఇంతమంది వెళ్లినా తెలుగు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ కు సమాచారం అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పరీక్షలకు రావాలని ఆదేశించినా కొందరు ఇంకా బయటకు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: