పాద‌యాత్ర స‌మ‌యంలో ఉన్న దూకుడు జ‌గ‌న్‌లో సీఎం అయ్యాక లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు వై సీపీ నాయ‌కులు. అయితే, నేను చేయాల్సింది చేస్తున్నాను.. ఇక‌, ప్ర‌జ‌లకు అందాల్సిన ఫ‌లాలు అందుతున్నాయి. సో.. నేను ఎలా ఉంటే ఏంటి? అనే రోజులు పోయాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ క‌రోనా ముందు వ‌ర‌కు పెద్ద‌గా మీడియా జోలికి వ‌చ్చేవారు కాదు. కానీ, ఇప్పుడు మాత్రం నిత్యం మీడియాతోనే ఉన్నారు. ఈ త‌ర‌హాలో జ‌గ‌న్ కూడా క‌రోనా వ్యాధి త‌గ్గే వ‌ర‌కు కూడా మీడియాతో ఉండాల‌నేది రాజ‌కీయ వేత్త‌లు సూచిస్తున్నారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు-జ‌గ‌న్‌కు మ‌ధ్య గ్యాప్ పెర‌గ‌కుండా ఉండ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల్లోనూ మ‌నోధైర్యం క‌లుగుతుంద‌ని చెబుతున్నారు  ప‌రిశీల‌కులు. 


వైసీపీ స్థాపించిన నాటి నుంచి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వ‌న్ మ్యాన్ ఆర్మీగా ప‌నిచేశారు. పాద‌యాత్ర‌ల‌తో  ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వ‌డం, ప్రజాభిమానం పెరిగాక అనేక మంది నేత‌లు క్ర‌మంగా వ‌చ్చి చేరారు. ప్ర‌జాబ‌లంతో రాజ‌కీయంగా నిల‌దొక్కుకోగ‌లి గారు. అదే ప్ర‌జాబ‌లంతో  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రిని చేశారు. అయితే సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి జ‌నంలోకి నేరుగా వెళ్లింది బ‌హుత‌క్కువేన‌ని చెప్పాలి. దీనికి వేర్వేరు కార‌ణాలు ఉండ‌వ‌చ్చు. క‌రోనాలాంటి మ‌హ‌మ్మారి రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న స‌మయంలో కూడా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల‌తో నేరుగా మాట్లాడే, బాగోగులు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌కుంటే  విప‌క్షాలు దాన్ని మ‌రోకోణంలో జ‌నంలో ప్ర‌జెంట్ చేసే ప్ర‌మాదం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా అలికిడి మొద‌లైన నాటి నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ వేగంగా స్పందిస్తున్నారు. నిత్యం స‌మీక్ష‌లు, స‌మావేశాల‌తో ఎప్ప‌టిప్పుడు ప్రెస్‌మీట్ల‌లో ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను చెప్పుకొస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని ప్ర‌జ‌లకు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.దీంతో ప్ర‌జల్లో ప్ర‌భుత్వంపై, ముఖ్యంగా కేసీఆర్‌పై సానుకూల స్పంద‌న ఏర్ప‌డుతోంది. అదే ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మీడియాకు దూరంగా ఉంటున్నార‌నే ఆభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. నిర్ణ‌యాల్లో వెల్ల‌డిలోనూ వెనుకా ముందు ఆడుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అన్నా జ‌గ‌న‌న్న మ‌నం, మ‌న ప్ర‌భుత్వం పొరుగునున్న తెలంగాణ ముఖ్య‌మంత్రికంటే స్పీడు ఉండాలే అంటూ వైసీపీ కార్య‌కర్త‌లు కోరుతున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: