ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటలలోపు ఏకంగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఈరోజు ఉదయం వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 87కు చేరింది. 
 
రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందుజాగ్రత్తచర్యలు చేపడుతోంది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, ఆశా వర్కర్ల సహాయంతో ఎప్పటికప్పుడు ప్రజల నుండి వివరాలను సేకరిస్తూ కరోనా నివారణ కొరకు కృషి చేస్తుంది. కానీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి మరింత సహాయసహకారాలు అందాల్సి ఉంది. కరోనా విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాయిస్ వినిపించాల్సి ఉంది. సీం జగన్ కనీసం రెండు రోజులకు ఒకసారైనా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు తగిన సూచనలు చేస్తే మంచిది. 
 
అధికార పార్టీ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజల్లో ధైర్యం నింపాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని... కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. తమ ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు కరువయ్యారని రాష్ట్రంలో కొంతమంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరుతున్నారు. 
 
ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలను అమలు చేస్తూ కేసుల సంఖ్య మరింతగా పెరగకుండా కృషి చేయాల్సి ఉంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో అధికారుల నిర్లక్ష్యం వల్ల లాక్ డౌన్ సరిగ్గా అమలు కావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. అదే సమయంలో రాష్ట్ర ప్రజలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండేలా చూసి ప్రజలకు కరోనా కట్టడి కోసం తగిన సూచనలు చేస్తూ ప్రజల సహకారంతో కరోనా కేసులు నమోదు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: