ప్ర‌స్తుతం యువ‌తలో ఫోన్ వాడ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. అయితే ఒకప్పుడు ఫోన్ వాడ‌కం అనేది కేవ‌లం ఒక‌రి నుంచి మ‌రొక‌రికి స‌మాచారాన్ని అందించుకోవ‌డం వ‌ర‌కే వాడేవారు. కానీ నేటి యువ‌త ఫోన్‌ని చాలా విధాలుగా వాడుతున్నారు. చేతిలో ఫోన్ ఉండి దానికి నెట్ క‌నెక్ట్ అయి ఉంటే చాలు ప్ర‌పంచ‌మంతా త‌మ చేతుల్లో ఉన్న‌ట్లే. అందులోనూ నేడు సోష‌ల్ మీడియాలు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల ఎప్పుడు చూసినా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాస్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఇక ఈమ‌ధ్య‌నే వ‌చ్చిన టిక్‌టాక్ ఇలా ర‌క ర‌కాల మాధ్య‌మాల‌ను వాడుతూ తెగ స్పీడ‌యిపోతున్నారు. అయితే వాటితో స్పీడ‌యిపోతే ప‌ర్వాలేదుకానీ అదొక వ్య‌స‌నంలా మారిపోయింది చాలా మందికి. ఎలాగంటే కొంత మంది ఫోన్ చూస్తూ ఎవ్వ‌ర‌న్నా ఏద‌న్నా మాట్లాడుతున్నా ప‌ట్టించుకోరు పూర్తిగా అందులో మునిగిపోయి ఉంటారు. మ‌రికొంత మంది ప‌క్క‌న ఎవ్వ‌రు ఉన్నా వారి ప‌నిలో వారు మునిగిపోయి టిక్‌టాక్ వీడియోలు వాట్సాప్‌లు చూసుకోవ‌డం ఇలాంటివ‌న్నీ చేస్తుంటారు. మ‌రి అలాంట‌ప్పుడు చాలా మంది పెద్ద‌వారికి పిల్ల‌ల‌ను చూస్తే కోపం వ‌చ్చే సంద‌ర్బాలు కూడా అనేక‌మనే చెప్పాలి.

 

ఇక ఇదిలా ఉంటే ఇటీవ‌లె ఓ యువ‌తి టిక్‌టిక్ పిచ్చితో ఎప్పుడు చూసినా ఏదో ఒక పాపుల్ సాంగ్‌ని తీసుకుని టిక్‌టాక్ వీడియోలు చేస్తూ ఉండేది. దాంతో మంచి ఫాలోవ‌ర్స్‌ని కూడా బాగానే సంపాదించింది. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది కానీ ఇటీవలే ఆమెకు కరోనా వైరస్ సోకింది. దాంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఐసోలేషన్ వార్డులోనూ ఆమె టిక్ టాక్ పిచ్చి వదల్లేదు. శానిటైజేషన్ సిబ్బందితో కలిసి టిక్ టాక్ వీడియో చేసింది. ఈసారి ఓ స్యాడ్ సాంగ్ సెలెక్ట్ చేసుకుని టిక్‌టాక్ చేసింది. ఇక ఆ వీడియో గంటల వ్యవధిలోనే కరోనా వైరస్‌లా ఫుల్ పాపుల‌ర్ అయింది. దాంతో రంగంలోకి దిగిన అధికారులు 25 ఏళ్ల ఆ మహిళతో కలిసి టిక్ టాక్ వీడియో చేసిన శానిటైజేషన్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. అంతేకాక వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు.

 

ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. ఈ యువతి 25 సంవ‌త్స‌రాలుంటాయి. చెన్నైలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది. ఇక ఈమె ఖాళీ దొరికినప్పుడల్లా టిక్‌టాక్‌తో కాలక్షేపం చేయడం ఆమెకు సరదా. ఆఖ‌రికి ఒంట్లో బాగోలేక ప్రాణాంత‌క వ్యాధితో ఇబ్బందిప‌డుతున్న‌ప్ప‌టికి టిక్‌టాక్‌ని మాత్రం వ‌ద‌ల్లేదు. దాంతో ఆమెతో పాటు ఆమెకు ఈ వీడియో చెయ్య‌డానికి స‌హ‌క‌రిచిన న‌లుగురి ఉద్యోగాల నుంచి స‌స్పెండ్ చేసి క్వారంటైన్‌కి త‌ర‌లించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: