క‌రోనా వైర‌స్‌.. చైనా లోని హుబై ప్రావిన్స్ యొక్క రాజధాని అయిన వూహాన్ పట్టణంలో అంతుచిక్కని సామూహిక న్యుమోనియాగా నమోదు అయ్యి.. ఆ త‌ర్వాత క‌రోనా వైర‌స్‌గా ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసింది. ఇక ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 8 లక్షల 60 వేలు దాటింది. మ‌రియు 42 వేలకు పైగా ప్రజలు చనిపోయారు. ప్ర‌స్తుతం ఈ వైరస్ పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయపడిపోతున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా ఈ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డం. దీంతో ఈ ర‌క్క‌సిని నియంత్రించేందుకు దేశ‌దేశాలు లాక్ డౌన్ విధించాయి.

 

ఇందుకు భార‌త్ కూడా మిన‌హాయింపు కాదు. భారతదేశంలోనూ 1637 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 38 మంది మరణించారు. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లో సైతం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఇదిలా ఉంటే.. నిన్నటి వరకూ కరోనా ప్రభావం పెద్దగా కనిపించని ఏపీకి.. ఢిల్లీ మత సమావేశంతో పెద్ద షాకే త‌గిలింది. నిన్నటి నుంచి ఢిల్లీలో జరిగిన మత సమావేశానికి వెళ్లొచ్చిన వారిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 87కు చేరుకున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఏపీని ఇబ్బంది పెడుతున్న క‌రోనా వైర‌స్ విష‌యంలో ప్ర‌భుత్వం అన్నివిధాలా జాగ్ర‌త్త‌లు తీసు కుంటున్నా.. ప్ర‌జ‌ల్లో మాత్రం అవేర్నెస్ కొర‌వ‌డింది. 

 

ఈ నేప‌థ్యంలో వారికి ప్ర‌త్యామ్నాయంగా అవేర్ నెస్ క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం మ‌రింత దూకుడుగా ముందుకు రావాలి. విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించాలి. స్వీయ జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాలి. మాస్కులు, శానిటైజ‌ర్ల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కు అందించే లా చ‌ర్య‌లు తీసుకోవాలి. మ‌రీముఖ్యంగా వ‌యోవృద్ధుల ను హెచ్చ‌రించ‌డం, వారికి త‌గిన సూచ‌న‌లు ఇవ్వ‌డం విష‌యంలో ప్ర‌భుత్వం ఇప్పుడు చేస్తున్నది పావ‌లా వంతేన‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి వీటిపై సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎలా స్పందిస్తారు.. ఇప్ప‌టికైనా క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటారా.. లేదా.. అన్న‌ది చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: