ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు తీవ్ర సంక‌ట స్థితి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌నాల్లో కోత పెడుతూ.. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల కేవ‌లం స‌గం మాత్ర‌మే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వేత‌నాలు అందుతాయి. మిగిలిన స‌గం క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నాక ఇస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌ట్టు ప్ర‌భుత్వం ఓ జీవోలో స్ప‌ష్టం చేసింది. దీనిపై ఉద్యోగ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేగింద‌ని, ప్ర‌బుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని బాబు అనుకూల మీడియాలో క‌థ‌నాలు అప్పుడే వ‌చ్చేశాయి. అంతేకాదు, ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉన్నాయ‌ని, అయినాకూడా ఉద్దేశ‌పూర్వ‌కంగానే జ‌గ‌న్ వేత‌నాలు ఆపేశార‌ని కూడా రాశాయి.

 

అంతేకాదు, జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం న్యాయ ప‌రిశీల‌న‌లో ఎవ‌రైనా కోర్టుకు వెళ్తే నిల‌వ‌ద‌ని కూడా క థ‌నం క్లూ ఇచ్చింది. దీంతో, ఇప్పుడు ఇదే అవ‌కాశంగా చంద్ర‌బాబు జ‌గ‌న్‌పైనా, ఆయ‌న నిర్ణ‌యంపై చం ద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేయాలి! ఇదీ ఆ మీడియా ప్ర‌ధాన ఉద్దేశం. అయితే, బాబుకు ఇప్పుడు ఈవిషయం లో ఎలా స్పందించాల‌నే విష‌యంపై సందిగ్ధం ఏర్ప‌డింది. దీనికి కార‌ణం.. నిండు కుండ వంటి తెలంగా ణ‌లో నే కేసీఆర్ సగం క‌న్నా త‌క్కువే వేత‌నాలు ఇస్తాన‌ని హుకుం జారీ చేశారు. దీనిపై ఎవ‌రూ మాట్లాడ డానికి కూడా లేద‌న్నారు. అంతేకాదు, ఎవ‌రైనా విమ‌ర్శిస్తే..  వారికి క‌రోనా రావాల‌ని శ‌పించారు.

 

దీంతో ఇప్పుడు అక్క‌డ విప‌క్షాలు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రి ఏపీలో ప్ర‌భుత్వం క‌నీసం రెండు విడ‌త‌ల్లో అయినా పూర్తి వేత‌నం ఇస్తాన‌ని చెప్పింది. అది తెలంగాణ‌లో లేదు. ఇచ్చిన కాడికి తీసు కుని ద‌ణ్ణం పెట్ట‌డం త‌ప్ప చేయాల్సింది ఏమీలేదు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని, సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తే.. ఖ‌చ్చితంగా తెలంగాణ విష‌యంలోనూ ఆయ‌న స్పందించాలి. ఎందుకంటే టీడీపీ జాతీయ పార్టీ. తెలంగాణ‌లోనూ పార్టీ ఉంద‌ని చెప్పుకొంటున్నారు కాబ‌ట్టి. అయితే, అలా స్పందించే ప‌రిస్థితి బాబుకు లేదు. దీంతో ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని జీర్ణించుకోలేక‌, అలాగ‌ని విమ‌ర్శ‌లు చేయ‌లేక బాబు సంక‌ట స్థితిని ఎదుర్కొంటున్నారట‌! ఇదీ సంగ‌తి!!

మరింత సమాచారం తెలుసుకోండి: