ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాను అతలాకుతలం చేస్తున్నది.  ఇప్పటికే ఈ వైరస్ కారణంగా దేశంలో 1711 కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే 250 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.  ఓ వైపు దేశ నేతలు, సెలబ్రెటీలు ప్రతిరోజూ కరోనా వైరస్ గురించి దాని ప్రభావం గురించి చెబుతూనే ఉన్నారు.  కానీ కొంత మంది మాత్రం దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ని మాత్రం ఎవరూ లెక్కచేయడం లేదు.  ఇక లాక్ డౌన్ ని నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కరోనా విలయతాండవం మాత్రం తప్పడం లేదు. 

 

కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన చెందుతున్నది.  ఇక ఈ ఒక్కరోజే 15 మరణాలు సంభవించాయి.  ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులకు కరోనా పాజిటివ్ వస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక ఏపిలో కరోనా పాజిటీవ్ కేసులు 87కు చేరుకోవడంతో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. కోవిడ్-19పై ఉన్నత స్థాయి సమీక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టారు. 

 

నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకూ 43 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏకంగా 87కి చేరింది. 12 గంటల్లో మొత్తం 373 శాంపిళ్లను పరీక్షించగా, వాటిల్లో 330 నెగిటివ్‌గా తేలింది. ఈరోజు నమోదయిన కేసులలో 12 గంటల్లో కడపలో అత్యధికంగా 15, పశ్చిమ గోదావరిలో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: