క‌రోనా వైర‌స్‌.. ఈ మాట వినిపిస్తేనే ప్ర‌పంచ‌దేశాలు వ‌ణికిపోతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి మొట్టమొదట చైనా లోని హుబై ప్రావిన్స్ యొక్క రాజధాని అయిన వూహాన్ పట్టణంలో అంతుచిక్కని సామూహిక న్యుమోనియాగా నమోదు అయ్యింది.  అయితే చైనీస్‌ వైద్యాధికారులు దీనిని గుర్తించేలోపే ఇది వూహాన్ కేంద్రంగా చైనాలో, ఇతర దేశాలలో పాకిపోయింది. ఇక ఆ రోజు నుండి ప్రతి రోజు ఒకటి నుండి ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వచ్చాయి. ఈ క్ర‌మంలోనే  చైనా లెక్కల ప్రకారం.. ఆ దేశంలో కరోనా వైరస్‌తో మొత్తం 3,305 మంది ప్రాణాలు కోల్పోగా, వుహాన్ నగరంలోనే 2,548 మరణాలు సంభవించాయి.

 

ప్ర‌స్తుతం చైనాలో క‌రోనాకు అడ్డుక‌ట్ట వేసింద‌నే చెప్పాలి. చైనాలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. ఇతర దేశాల్లో మాత్రం విజృంభిస్తోంది. అయితే ఇంత జ‌రుగుతున్నా చైనీయులు మాత్రం మార‌డం లేద‌ని చెప్ప‌లి. కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని ప్రకటించిన చైనాలో ఆహార మార్కెట్లు తిరిగి తెరుచుకోగా, అక్కడ కబేళాలకు సిద్ధమైన మూగ జీవాలు వేలాడుతూ అదే అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. గబ్బిలాలు, ఇతర మూగజీవాల ద్వారా ఈ మహమ్మారి మానవులకు వ్యాపించిందన్న సమాచారంతో ఈ ఏడాది జనవరిలో చైనాలో ఆహార మార్కెట్ల మూత‌ప‌డ్డాయి.

 

అయితే అక్క‌డ క‌రోనా కేసులు త‌గ్గ‌డంతో చైనా ఫుడ్‌ మార్కెట్లలో తిరిగి అపరిశుభ్ర వాతావరణంలో మూగజీవాల విక్రయం ఆందోళన కలిగిస్తోంది. కరోనావైరస్‌కు ముందున్న స్ధితిలోనే మార్కెట్లు తిరిగి పనిచేస్తున్నాయని డైలీమెయిల్ వెల్ల‌డించింది. ఇక ఆగ్నేయ చైనాలోని గిలిన్‌ నగరంలో అస్వస్థతలను నివారించేందుకు గబ్బిలాలు, పాములు, స్పైడర్లు ఇతర మూగజీవాలను తినాలంటూ సూచించే ప్రకటన బోర్డు మ‌రింత ఆందోళ‌న క‌ల‌గ‌చేస్తుంది. మ‌రోవైపు కరోనా మరణాల విషయంలో చైనా వెల్లడించిన వివరాలపై ముందు నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవాలను దాచిపెట్టి ప్రపంచదేశాలనూ డ్రాగన్ తప్పుదోవపట్టించదనే ప్రచారం జరుగుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: