తెలుగు మీడియాలో సాక్షి మీడియా ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత మీడియా అన్న సంగతి తెలిసిందే. అయితే మరో రెండు టీవీ ఛానళ్లనూ సాక్షి 2, సాక్షి 3 అంటూ టీడీపీ సోషల్ సైనికులు ట్రోలింగ్ చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం చేతుల మారిన టీవీ9ను సాక్షి 2 అంటూ...ఎన్టీవీని సాక్షి 3 అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు.. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై పసుపు సైనికులు కొత్త కథనాలు వండి వారుస్తున్నారు.

 

 

చాలా రోజుల తర్వాత మంత్రి కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి టీడీపీ నాయకులను తనదైన శైలిలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఇదీ కారణం అంటూ టీడీపీ సోషల్ మీడియా ఓ కథనం సర్క్యులేట్ చేస్తోంది. నాని మౌనం వీడ‌డం వెనుక.. మంత్రి ప‌ద‌వి ఊడ‌బీక‌మంటావా? చ‌ంద్రబాబుని తిడ‌తావా? అంటూ జ‌గ‌న్ గ‌ద్దించడమే కారణమని ఈ సోషల్ సైనికులు తేల్చేస్తున్నారు. కొడాలి నానికి కేవ‌లం చంద్రబాబు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు, టీడీపీ నేత‌ల్ని దారుణంగా తిట్టాలి అనే ఒప్పందంతోనే పార్టీలో చేర్చుకున్నారని... మంత్రి ప‌ద‌వి ఇచ్చారని అంటున్నారు.

 

టీడీపీ సోషల్ సైనికులు సర్క్యులేట్ చేస్తున్న కథనం ఇలా ఉంది.

 

కొడాలి నాని తిట్లను ఇటీవల ఆయ‌న కుటుంబసభ్యులు త‌ట్టుకోలేక‌పోయారు. త‌మ‌ను ఎంత‌గానో కొడాలి నానికి ఈ విష‌యం చెప్పి, ఇది మంచి ప‌ద్ధతేనా? మ‌మ్మల్ని ఇలాగే ఎవ‌రైనా తిడితే ఊరుకుంటావా? అని నిల‌దీశారు. దీంతో ఏం చెప్పాలో తెలియ‌ని నాని మౌనం వ‌హించాడు. అలాగే గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో నాని గెలుపు కోసం కీల‌కంగా ప‌నిచేసిన నేత‌లు కూడా ఇది చాలా న‌ష్టం చేస్తోంద‌ని హెచ్చరించారు.

 

 

కుటుంబ‌ స‌భ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావ‌డంతో కొన్నాళ్లు నోటికి ప‌ని చెప్పకుండా మీడియాకి దూరంగా ఉండ‌టం ప్రారంభించాడు. కేవ‌లం చంద్రబాబు, ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల్ని తిట్టే ఒప్పందంతో పార్టీలో చేర్చుకుని మంత్రి ప‌ద‌వి క‌ట్టబెడితే ఇంట్లో పోయి కూర్చుంటాడా? కొడాలి నాని మంత్రి ప‌ద‌వి పీకేసాన‌ని చెప్పండంటూ ఘాటు హెచ్చరిక‌లు పంపారు జ‌గ‌న్ రెడ్డి.

 

 

అంతేకాదు పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ స‌మీక్ష నీటిపారుద‌ల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌కి అప్పగించారు. పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ ప్రక‌ట‌న‌ల‌ను ర‌వాణాశాఖ మంత్రి పేర్నినానితో ఇప్పించారు. దీనిపై కొడాలి నాని అల‌కబూని పేర్నినాని ద‌గ్గర ల‌బోదిబోమ‌న్నాడు. దీనిపై పేర్నినాని స్పందిస్తూ కేవ‌లం చంద్రబాబు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు, టీడీపీ నేత‌ల్ని తిట్టడానికి వారి కులం వాడినైన నిన్ను జ‌గ‌న్ గారు ఏరికోరి మ‌రీ తెచ్చుకున్నారు. నువ్వు వారిని తిట్టడం మానేసి ఇంట్లో కూర్చుంటే ఇంకెందుకు కొడాలి నానికి మంత్రి ప‌ద‌వి అని కోపమ‌య్యారు జ‌గ‌న్ గారు అని పేర్ని నాని వివ‌రించాడు. వెంట‌నే రంగంలోకి దిగిన కొడాలి నాని త‌న‌కు మాత్రమే వ‌చ్చిన స‌భ్యస‌మాజం విన‌లేని బూతుల‌తో ప్రెస్ మీట్ పెట్టాడు.”

ఇలా తమ టాలెంటంతా ఉపయోగించి టీడీపీ సోషల్ సైనికులు తమ క్రియేటివిటీ ఉపయోగించి కథలు అల్లేస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: