మాములుగా ఎవరినైనా పిలవాలంటే వారి పేరు పెట్టి మరియాదగా పిలుస్తాం. కానీ చాలా మంది అలా కాకుండా ముద్దు పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఇక ఎవరికి నచ్చిన పేరు వారు పెట్టి ఆ పేరుతో పిలుస్తుంటారు. ఇక అబ్బాయిలను ఎలా పిలిచినా పర్లేదు కానీ అమ్మాయిలను ఇలా పిలిస్తే ఫిదా అయిపోతారంట. అంతేకాక ఆ సమయంలో వారు ఏమి అడిగినా కూడా ఇవ్వడానికి రెఢీ అంటారంట. ఆ పేరు అంటే వారికి అంత ఇష్టమా ఇంతకీ ఆ పేరు ఏంటి అన్నదేగా మీ సందేహం. ఈ తరం కుర్రకారు ప్రేమికులు బేబి అని పిలుచుకుంటున్నారట. బేబి అన్న పదం అబ్బాయిలకు ఎలా ఉన్నా అమ్మాయిలకు మాత్రం తెగ ఇష్టమట. అమ్మాయిలకు బేబి అన్న పదం గమ్మత్తుగా అనిపిస్తుందట.
ఆ పదం వినగానే చిన్న పాపను లాలించినట్టు తండ్రిలాగా గారాబం చేసినట్టు అనిపిస్తుందట. అయితే ఇప్పటికే చాలా మంది ఇళ్ళలో ఈ పేరు ఉంది. ఇదంత గొప్ప పేరు కానప్పటికీ చాలా విలువైన పేరని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీ లవర్, భార్యను సొంత పేరు కాకుండా బేబి అని పిలవండి. దాంతో ముసి ముసి నవ్వులు ఆమె పెదాల నుంచి ఖచ్చితంగా కనిపిస్తాయంట. అయితే బేబి అని మాత్రం పిలవద్దంట అలా పిలిస్తే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు లవ్ టెక్ నిక్ తెలిసినవారు. అయితే చాలా మంది ఈ కన్సెప్ట్ నే తెగ పాటిస్తున్నారంట.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ సబ్జెక్ట్ అయింది. అలాగే అబ్బాయిల విషయం వచ్చేసరికి చాలా మంది అమ్మాయిలు బుజ్జి అని, బంగారం అని,, ఇంకా హనీ ని ఇలా రక రకాల పేర్లతో వారికి నచ్చిన విధంగా నచ్చినట్లు పిలుస్తుంటారు. మరి కొంత మంది అయితే భర్తను పేరు పెట్టి పిలుస్తారు. దాంతో వారు భార్య ప్రేమకి ఫిదా అయిపోతారు. ఇలా ఒకరికి ఒకరు ప్రేమాభిమానంతో ఉంటారు.