రాష్ట్రంలో పెరుగుతున్న క‌రోనా కేసుల గురించి ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం అనంత‌రం క‌రోనా క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు, ప్ర‌జ‌లు పాటించాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై మీడియా ద్వారా రాష్ట్ర ప్ర‌జానీకానికి తెలియ‌జేశారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 87 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లుగా వెల్ల‌డించారు. అయితే ఇందులో 70 వ‌ర‌కు ఢిల్లీలో జ‌రిగిన ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారివేన‌ని తెలిపారు. అయితే ఢిల్లీకి వెళ్లినారు దాదాపు 1085మంది ఉన్న‌ట్లుగా గుర్తించిన‌ట్లు తెలిపారు.


 అయితే 25మందిని మిన‌హా మిగ‌తా వారంద‌రీని క్వారంటైన్‌కు త‌ర‌లించి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 500మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా దాదాపు 70మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలిపారు. అలాగే మిగ‌తా వారి రిపోర్టులు అందాల్సి ఉంద‌ని అన్నారు. మ‌రో 2మంది ఆచూకీ క‌నుగొనే ప‌నిలో అధికారులున్న‌ట్లుగా తెలిపారు. అయితే నిన్న మొన్న‌టి వ‌ర‌కు అదుపులోనే క‌రోనా రాష్ట్రం వెలుప‌ల జ‌రిగిన సంఘ‌ట‌న‌తో కేసుల సంఖ్య పెరిగిపోతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే క‌రోనాపై జాగ్ర‌త్త‌లు వ‌హిస్తే కేవ‌లం 14 రోజుల్లో సాధార‌ణ జీవ‌నానికి చేరుకోవ‌చ్చ‌ని తెలిపారు.

 

ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఢిల్లీ వెళ్లివ‌చ్చిన వారు స్వ‌చ్ఛందంగా వైద్య ప‌రీక్ష‌లు వెళ్లాల‌ని సూచించారు. ఢిల్లీ ప్రార్థ‌న‌ల్లో పాల్గొని వ‌చ్చి న‌వారికి స‌న్నిహితంగా మెదిలిన వారు, కుటుంబ‌స‌భ్యులు వెంట‌నే వైద్య‌ప‌రీక్ష‌లకు వెళ్లాల‌ని సూచించారు. మీరు వెళ్ల‌లేని ప‌రిస్థితుల్లో ఉంటే 104కు కాల్ చేస్తే వైద్యులు మీ వ‌ద్ద‌కు వ‌స్తార‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనాను ఎదుర్కొవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌ర్వ‌స‌న్న‌ద్ధ‌మై ఉంద‌ని అన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాధిగ్ర‌స్తుల గుర్తిపున‌కు ఇంటింటిస‌ర్వే కొన‌సాగుతోంద‌ని తెలిపారు. వైద్య ఆరోగ్య‌శాఖ కూడా సన్న‌ద్ధ‌మై ఉంద‌ని చెప్పారు. అవ‌స‌ర‌మైతే వైద్య‌సేవ‌ల‌కు ప్రైవేటు వైద్య‌శాల‌ల‌ను కూడా వినియోగించుకుంటామ‌ని తెలిపారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: