1, 88, 639, 1, 05, 792, 1, 02, 136 అమెరికా, ఇటలీ, స్పెయిన్ లో ఇప్పుడు కరోనా కేసు ల సంఖ్య ఇది. అమెరికాలో కరోన వైరస్ కారణంగా దాదాపు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ కారణం గా ఇటలీలో 11 వేల మంది చనిపోయారు. ఇక స్పెయిన్ లో కరోనా కారణంగా 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పుడు అన్ని విధాలుగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఆ దేశంలో మరణాలు ఇప్పుడు మరింత తీవ్రంగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఆ దేశాలు చేయని ప్రయత్నాలు లేవు. 

 

మరింత పరిస్థితి దిగజారితే మాత్రం ఇప్పుడు చెయ్యాల్సింది ఏమీ లేదు అనేది అర్ధమవుతుంది. అమెరికాలో రాబోయే రెండు మూడు రోజుల్లో ఎక్కువగా కేసులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మరణాలు కూడా ఆ దేశంలో ఇంకా పెరుగుతాయని అంటున్నారు. అమెరికాలో కరోనా మరణాలు మూడు లక్షల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఇప్పుడు కరోనా వైరస్ కి మందు కనుక్కోవడం మినహా ఆ దేశాల్లో పరిస్థితి కట్టడి అయ్యే అవకాశాలు కనపడటం లేదు. స్పెయిన్ లో ఇంకా భారీగా మరణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. 

 

స్పెయిన్ లో మరో రెండు మూడు రోజుల్లో కరోనా మరణాలు దాదాపుగా 10 వేల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా వైరస్ అమెరికాకు, స్పెయిన్ కి, ఇటలీకి శాపం అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఇటలీ ఆర్ధిక పరిస్థితి ఇప్పటికే దాదాపుగా దిగజారిపోయింది. ఇక స్పెయిన్ కూడా అదే బాటలో ఉంది. అమెరికా పరిస్థితి కూడా దాదాపుగా ఇదే స్థాయిలో ఉంది అని అంటున్నారు. ఈ మూడు దేశాలు మరింతగా దిగజారే అవకాశాలు అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: