"కుంజరః యోదంబు దోమ కుత్తుక జొచ్చెన్" అంటే ఇదే మరి... ఇపుడు యావత్ ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లో బంధీగా వుంది అనడంలో సందేహమే లేదు.. ఈ మహమ్మారి వైరస్ కట్టడికి ఒక్కో దేశం ఒక్కో తరహాలో చర్యలు పాటించగా.. వాటిని ఇపుడు ఐక్యరాజ్య సమితి తప్పుబడుతోంది. కొద్ది సేపటి క్రితమే... ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రస్తావిస్తూ.. కరోనాను ఎదుర్కోవడానికి ఎవరికి వారు సొంత నిర్ణయాలతో వెళ్తున్నారు తప్ప, ప్రపంచ ఆరోగ్య సంస్థ - WHO మార్గదర్శకాలను ఎవ్వరూ... బేఖాతరు చేయడం లేదని విమర్శించారు.

 

మామ్మూలుగానే.. ఇపుడు WHO మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో వారి మాటలు వినాలని ఆంటోనియో గుటెరస్ అనుకోవడం అమాయకత్వమే అవుతుంది... అయినను ప్రస్తుత పరిస్థితులలో ఎవరి ఇల్లు వారు చక్కబెట్టుకోవాలి అన్నట్లు... ఎవరి నిర్ణయాలు వారు తీసుకొని.. వెంటనే అమలు పరిచి... వీలైనంత తొందరగా కరోనాను తరిమి కొట్టాలని చూస్తున్నారు.. తప్ప, వేరెవరో... సలహాలు తీసుకునే టైం ఇపుడు ప్రభుత్వాలకు లేదు.

 

ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య ఘడియ ఘడియకు మారిపోతుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి నిమిషానికి 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... మరణాలు.. గంటకు 30 వరకు నమోదు అవుతున్నాయని సమాచారం.. ఇటువంటి తరుణంలో WHO లేదంటే... మరే ఇంకో.. సంస్థ విడుదల చేసిన ప్రకటనలు, సలహాలు కోసం వేచి చూడాల్సిన సమయం ఎవరికుంటుంది.... ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే... ఈ క్షణం వరకు నమోదైన కేసుల సంఖ్య ఇదే...

 

ప్రపంచలో మొత్తం కేసులు: 8, 76, 651
మరణాలు: 43, 531
రికవరీ కేసులు: 1, 84, 965

 

ఇండియాలో మొత్తం కేసులు: 1637 
మరణాలు: 45 
కొత్త కేసులు: 240
రికవరీ కేసులు: 148 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 97
మృతులు: 6 
ఏపీలో మొత్తం కేసులు: 87
మృతులు: 0

 

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...

విశాఖపట్నం: 11 
తూర్పు గోదావరి: 6 
కృష్ణా: 6 
గుంటూరు:9 
ప్రకాశం: 15 
నెల్లూరు: 3 
చిత్తూరు: 6 
కర్నూలు: 1 
కడప: 15 
అనంతపురం: 2 
పశ్చిమ గోదావరి: 13 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: