కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణ కొరకై లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతోంది. లాక్ డౌన్ సమయంలో ఎటువైపు నుండి డబ్బులు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల్లో నష్టపోతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వేల కోట్ల రూపాయలను బడ్జెట్ నుండి తీసి మరీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాల్సివస్తుంది. 

 

 

తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... ఢిల్లీ ప్రార్ధన ఈ కార్యక్రమానికి హాజరైన వారి వలన కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుండటం తనని బాధిస్తుందని చెప్పారు. కరోనా వైరస్ సోకితే భయాందోళనలకు గురి కావద్దని... ఈ వైరస్ జలుబు దగ్గు లాంటిదేనని... కరోనా వచ్చినప్పటికీ వెంటనే నయం అవుతుందని... కరోనా రోగులను ద్వేషంతో చూడవద్దని... ప్రేమ ఆప్యాయత వారిపై చూపిస్తేనే... వారు తొందరగా కోలుకునేందుకు ఆస్కారం ఉంటుందని జగన్ అన్నారు. వయసు పైబడిన వారిలో మూడు నాలుగు వ్యాధులు ఉన్నవారిపై ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని... అందుకే వృద్ధుల కాస్త అప్రమత్తంగా ఉండాలని జగన్ విజ్ఞప్తి చేశారు. 87 కరోనా కేసులలో 70 మంది బాధితులు ఢిల్లీ నుండి వచ్చిన వారేనని ఆయన అన్నారు. 

 

 

అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో సగం జీతం చెల్లిస్తామన్న నిర్ణయానికి ప్రభుత్వ ఉద్యోగులంతా సానుకూలంగా స్పందిస్తూ... ఆమె సూచించిన విధంగా జీతాలను తీసుకునేందుకు ముందుకు వచ్చారని... అందుకు తాను సంతోషిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అర్థం చేసుకోవాలని... నిధులు సమకూరిన తర్వాత మిగతా సగం జీతాన్ని కూడా ఇస్తామని ఆయన అన్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల లో పోతన విధించారు అన్న సంగతి తెలిసిందే. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: