కరోనాపై పోరాటం అంటే అది కేవలం ప్రభుత్వాలు చేసే పని మాత్రమే కాదు. సమాజానికి కష్టం వచ్చినప్పుడు అంతా తలో చేయి వేయాలి.. సమాజాన్ని ఆ కష్టం నుంచి గట్టెక్కించాలి. ఇప్పుడు కొందరు దాతలు అదే పని చేస్తున్నారు. తమ శక్తి కొద్దీ ప్రభుత్వాలకు సాయం చేస్తూ మానవత్వానికి ప్రతి రూపంగా నిలుస్తున్నారు. కరోనాపై పోరాటంలో తామూ పాల్గొంటామని తమ సాయం ద్వారా చెబుతున్నారు.

 

 

కరోనా పై పోరాటానికి ఏపీ ప్రభుత్వానికి విరాళాలు అందుతున్నాయి. ఏపీ విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు రూ.7.87 కోట్లు, ట్రాన్స్‌కో, జెన్‌కో, తూర్పు, దక్షిణ, కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థల ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేశారు. దివీస్‌ ల్యాబ్‌ లిమిటెడ్‌ రూ.5 కోట్లు, ఎన్‌సీపీ లిమిటెడ్‌ రూ.కోటి అందజేశాయి. ఏపీలోని పౌల్ట్రీ అసోసియేషన్‌లు, నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు కలిపి రూ.60 లక్షలు అందించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు రూ.25 లక్షలు ఇచ్చారు.

 

 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రూ.44 లక్షల 52 వేలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్‌లో పనిచేసే ఎల్‌1, ఎల్‌2 కేటగిరి ఉద్యోగులతో పాటు మండల స్థాయి సమాఖ్యలో పనిచేసే సిబ్బంది మొత్తం తమ ఒక్క రోజు వేతనమైన రూ.33 లక్షలు విరాళమిచ్చారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లోని కాంట్రాక్ట్‌ రెసిడెంట్‌ టీచర్‌లు రూ.17 లక్షలు విరాళం ఇచ్చారు.

 

 

ఇలా సంస్థలే కాదు.. పలువురు వ్యక్తులు వ్యక్తిగతంగానూ విరాళాలు అందిస్తున్నారు. పాపులర్‌ షూమార్ట్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్లు చుక్కపల్లి అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్‌ రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. గుంటూరు జిల్లా పెనుమాక నివాసి, రైతు కళ్లం నరేంద్రరెడ్డి రూ.1,00,116 విరాళం అందించారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన యడ్ల గోపాలరావు రూ.2 లక్షలు, డా.బగ్గు శ్రీనివాసరావు రూ.లక్ష కె.మధుసూదనరావు రూ.లక్ష విరాళమిచ్చారు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: