కరోనా వైరస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహారశైలిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సీరియస్ అంశాన్ని కూడా జగన్ డీల్ చేస్తున్న తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా వరకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పేరు వింటే మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులకు చెమటలు పడుతున్నాయి. కాని జగన్ మాత్రం దీని విషయంలో మాట్లాడుతున్న మాటలు ఆయనకు ఇది ఎంత తేలిక విషయమో అర్ధమవుతుందని అంటున్నారు. 

 

కరోనా అనేది ముందు మందు బిళ్ళ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు జగన్. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నా సరే జగన్ ఇలాగే మాట్లాడుతున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో ఆయనలో సీరియస్ నెస్ అనేది కనపడటం లేదని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఆయన కరోనా మీద చెప్పిన లెక్కలు గాని, కరోనా బాధితుల గురించి చేసిన వ్యాఖ్యలు గాని, కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాని, కేంద్ర ప్రభుత్వ సాయం గురించి గాని ఎక్కడా కూడా మాట్లాడలేదు. 

 

కరోనా బాధితులు క్వారంటైన్ లో ఎంత మంది ఉన్నారు, అనుమానితుల సంఖ్య ఎంత, ఎంత మందికి తగ్గింది, ఎంత మంది ఇంకా బాధపడుతున్నారు, రైతుల వ్యవసాయ ఉత్పత్తులపై మాట్లాడిన మాటలు గాని ఏ ఒక్కటి కూడా లేవు. ఒక పక్క సరిహద్దున ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి వలస కార్మికుల గురించి, ప్రజలకు చేసే సాయం గురించి ఇలా అన్నీ కూడా మాట్లాడుతున్నారు. కాని జగన్ మాత్రం ఇక్కడ ఎక్కడా కూడా ప్రసంగంలో పెర్కొనలేదు. కరోనాను జగన్ జ్వరం తో పోల్చారు, మానవత్వం చూపించాలీ, వివక్ష వద్దని అన్నారు. కాని జగన్ మాత్రం ఎక్కడా కూడా విషయంతో మాట్లాడలేదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: