మనిషి మనిషిగా పుడుతున్నాడు కానీ ప్రవర్తనలో మాత్రం మృగంలా జీవిస్తున్నాడు.. పేరు చెప్పుకోవడానికే మానవుడు.. ఇలా ఎందుకు అనవలసి వస్తుందంటే.. లోకంలో నిత్యం చెలరేగుతున్న కామాంధుల దాడికి ఆడపిల్లలు అగ్గిపుల్లల్లా బూడిదైపోతున్నారు గానీ, ఒక్క మృగాన్ని ఎదిరించి నిలవలేక పోతున్నారు.. ఇలా ఎందుకంటే లోకంలో ఆడపిల్ల మగవాడి కింద పరుపులాంటిది అనే భావన ఇంకా అక్కడక్కడ ఉండటం వల్లే ఆన్యాయం అవుతున్నా ఎదురించలేకపోతున్నారు.. ప్రపంచం మొత్తం ప్రమాదం అంచుకు చేరినా.. మనిషి తన కామాన్ని తీర్చుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు..

 

 

నేటి కాలంలో మహిళలు మగవాడితో సమానంగా ప్రపంచాన్ని ఏలుతున్న, ఆ ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడు మగవాని కిందే ఉంటున్నారు.. అందుకే ఆడవారిపైన ఎన్ని లైంగిక దాడులు జరుగుతున్న, చట్టం ఎంతలా శిక్షిస్తున్న సమాజంలో మార్పు రావడం లేదు.. ఇకపోతే జులాయిగా తిరుగుతున్న ఓ యువకుడు అమ్మాయిని వేధించే క్రమంలో అతని అంగాన్నే కోల్పోయాడు.. ఈ ఘటన ముంబయిలో జరిగింది.. ఆ వివరాలు తెలుసుకుంటే.. ముంబయి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పనిపాట లేక బేవార్స్‌గా తిరుగుతూ కనిపించిన అమ్మాయినల్లా లైంగికంగా వేధిస్తుండేవాడు.. ఈ క్రమంలో ఒక సారి అతని కన్ను స్థానికంగా ఉద్యోగం చేస్తున్న యువతిపై పడింది.. అలా రోజూ ఆఫీసు నుంచి ఆ యువతి ఇంటికి వెళ్లే సమయంలో యువతిని అడ్డగించి ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ లైంగికంగా వేధించేవాడు.

 

 

తనకు ఇలాంటివి ఇష్టం లేదని, వెంట పడొద్దని ఎంత చెప్పినా ఆ యువకుడు వినిపించుకోలేదట. పైగా తన కోరిక తీర్చకపోతే చంపేస్తానని బెదిరించడంతో అతని భరతం పట్టాలని నిర్ణయించుకుని ప్లాన్ ప్రకారం అతడికి ఫోన్ చేసి ఫలానా చోటికి వస్తే కోరిక తీరుస్తానని చెప్పింది. దాంతో హుషారు ఆపుకోలేక ఆ యువతి పిలిచిన చోటుకు వెళ్లిన అతను ఆమె ఉన్న గదిలోకి వెళ్లగానే ఆ యువతి మెల్లగా అతన్ని ముగ్గులోకి దించింది.. ఈ క్రమంలో కోరిక ఆపుకోలేక ఆ యువతిని అనుభవించే క్రమంలో అతడు తన పాంటు జిప్పు తీసాడు..

 

 

ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ యువకుడి పురుషాంగాన్ని కోసేసింది. బాధతో ఆ యువకుడు కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ లోపలే యువతి అక్కడి నుంచి పరారయ్యింది... ఇక మిగతా విషయం ఏముంది పోలీసులు రావడం కేసు నమోదు చేసి దర్యాప్తూ ప్రారంభించడం మామూలే కదా.. కానీ ఏది ఏమైనా అమ్మాయిలు అత్యాచారాలకు గురికావద్దు అంటే కాస్త ధైర్యాన్ని సమకూర్చుకోవడం మంచింది అప్పుడే కామాంధులు కాస్త భయపడతాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: