కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ అయ్యింది. ఇల్లు కదిలేందుకు వీలు లేదు. ఎప్పుడైనా బయటకు వెళ్లినా కేవలం అది నిత్యావసరాలు తెచ్చుకునేందుకే. కరోనా సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు, కొన్ని నిత్యావసరాల షాపుల వాళ్లు.. వీళ్లు తప్ప అంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అంటే నూటికి 85 శాతం మంది మగాళ్లు ఇళ్లకే బందీలయ్యారు.

 

 

మరి ఇంట్లో గంటల తరబడి ఉంటే మగాళ్లు ఏం చేస్తారు.. ఫోన్లు పట్టుకుని స్నేహితులతో గప్పాలు కొట్టడం లేదా టీవీలకు అతుక్కుపోవడం ఇలాంటి పనులే చేస్తారు. కానీ కరోనా టైమ్‌లో ఇంటి పనుల విషయంలో మగవారు కూడా ఆడాళ్లకు సాయం చేయాలంటున్నారు ఓ సీఎం.. ఇంతకీ ఎవరా సీఎం అంటారా.. ఆయనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ఇంట్లో ఆడవాళ్లపై భారం మోపరాదని, మగాళ్లు ఇంటి పనుల్లో వారికి సహాయం చేయాలని

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సలహా ఇస్తున్నారు.

 

 

వంటావార్పు సన్నాహాలతో మహిళల్ని ఉక్కిరిబిక్కిరి చేయొద్దని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చెబుతున్నారు. ఇది విందు వినోదాలకు సమయం కాదని... ఇంటిల్లి పాది కలిసిమెలిసి బతకాల్సిన సమయమని చెప్పారు. ఇంటి పనుల్లో ఆడవాళ్లకు మగాళ్లు చేదోడు వాదోడుగా ఉండాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సలహా ఇచ్చారు. మగవాళ్లు కూర్చుని ఆడవారిని మరింత కష్ట పెట్టవద్దని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.

 

 

ఇలాంటి కష్టకాలంలో మహిళలను కేవలం వంటింటికి పరిమితం చేస్తే కుంగిపోతారని.. వారితో పాటు దేశం కూడా కుంగిపోతుందని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. మగాళ్లు ఓపికతో మసలుకోవాలని... ఆహారం వేళల్ని నియంత్రించుకోవాలని పట్నాయక్ సూచించారు. మరి ఈ సీఎం సలహాలను మగాళ్లు పట్టించుకుంటారంటారా..?

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: