తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల కార్యక్రమం కారణంగా దేశంలో కోవిడ్-19 విస్తారంగా వ్యాపిస్తోందనే వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరైన చాలా మందికి కరోనా వైరస్ సోకిందని వెల్లడయ్యింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని కరోనా కేసుల వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. అయితే తాజాగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాలలో ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

 

 

తాజాగా కర్ణాటకలో 24 మందికి, తమిళనాడులో 50 మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. జమాత్ మత ప్రార్థనలకు, అక్కడ జరిగిన కార్యక్రమాలకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కొన్ని వేల మంది హాజరయ్యారు. అయితే కర్ణాటక నుండి 300 మంది, తమిళనాడు నుండి 1,500 మంది ఆ కార్యక్రమానికి హాజరైనారని తెలిసింది. దాంతో ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, స్థానిక ప్రజలు భయపడిపోతున్నారు. కర్ణాటక నుండి ఢిల్లీ వెళ్ళినవారు, వాళ్ళకి చెందిన వారు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయం పై ఆరా తీస్తున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు తెలిపారు. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి కర్ణాటకకు తిరిగి వచ్చిన 50 మంది అడ్రస్ లు గుర్తించామని, వారిలో 12 మందికి కరోనా వైరస్ నెగిటివ్ అని తేలిందని, మిగిలిన వారి కోసం అధికారులు వెలుకుతున్నారని శ్రీరాములు వివరించారు.

 

 

అటు తమిళనాడు నుండి కూడా 1,500 మంది హాజరయ్యారని ఆ రాష్ట్ర అధికారుల విచారణలో తేలింది. ఇప్పటికే చాలా మందిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం, వారిని క్వారంటైన్లకు తరలిస్తున్నారు. పైగా తమిళనాడులో ఒకే రోజు 57 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఢిల్లీలో వెళ్లి వారు 50 మంది ఉండటంతో తమిళనాడు ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: