మహారాష్ట్రలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. అక్కడికి గ్రామ స్థాయిలో కరోనా వైరస్ వెళ్లిపోయింది అనే వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే అది కట్టడి అయ్యే అవకాశాలు దాదాపుగా కనపడటం ,లేదు. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అక్కడి ప్రభుత్వం సహాయం కోరే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మహారాష్ట్ర విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అక్కడ కట్టడి చేయడానికి ప్రత్యేక బృందాలను పంపుతుంది. 

 

ఇప్పటి వరకు అక్కడ కరోనా కేసుల సంఖ్య దాదాపుగా 3 50 కి దగ్గరలో ఉంది. అక్కడ ఇప్పట్లో ఇది అదుపులోకి వచ్చే అవకాశం లేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఉద్దావ్ థాకరే ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ ని అన్ని విధాలుగా కట్టడి చేస్తుంది. అయినా సరే ప్రజలు మాత్రం బయటకు రావడం ఆపలేదు. ఇప్పుడు అక్కడ కొన్ని కొన్ని పరిస్థితులు ప్రజలను భయపెడుతున్నాయి. కరోనా వైరస్ అక్కడ మూడో దశలో ఉందని అంటున్నారు. ఈ మూడో దశను అదుపు చేయడం అనేది చాలా వరకు కష్టమనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

విదేశాల నుంచి ప్రత్యేక వైద్య బృందాలను ఆ రాష్ట్రానికి తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది. కేంద్ర ప్రభుత్వం చర్యలు ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కువగానే ఉన్నాయి. అక్కడి ప్రజల విషయంలో కేంద్రం చాలా జాగ్రత్తలు తీసుకుని ఇతర రాష్ట్రాల నుంచి కూడా వైద్య బృందాలను పంపిస్తుంది కేంద్రం. అయినా సరే అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు. మరణాల సంఖ్య అక్కడ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరణాలు పెరిగితే మాత్రం కరోనా వైరస్ ని కట్టడి చేయడం అసాధ్యం అనే వాళ్ళు కూడా ఉన్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: