జగన్ అంటే ఏంటో పూర్తిగా చూసే అవకాశం ఏపీ ప్రజలకు వచ్చింది. ఆ మాటకు వస్తే ఈ దేశ ప్రజలకు కూడా జగన్ ఆలోచనలు, ఆయన ఏంటి అన్నది ముఖ్యమంత్రి అయిన తరువాతనే మెల్లగా అర్ధ‌మవుతోంది. జగన్ ఓ విధంగా చెప్పాలంటే ప్రత్యేకతలు చాలా ఉన్నవారిగానే చెప్పుకోవాలి.

 

చుక్కలన్నీ ఒక వైపు, నేను ఒక్కడు మరో వైపు అని ఓ తెలుగు సినిమా గీతం ఒకటి  ఉంది. దానికి అసలైన అర్ధం జగనే. ఆయన ఒకరిని ఫాలో అవరు. ఆయనే ఒక ట్రెండ్ సెట్టరు. ఇది కూడా ఓ పాపులర్ హీరో సినిమాలోని డైలాగే. అంటే జగన్ వేలం వేర్రిగా అందరూ అన్న దాని వెంట వెళ్ళరన్న మాట. తర్కంతో  ప్రతీ దాన్ని ఆలోచిస్తారని జనాలకు కొన్ని సార్లు వెంటనే అనిపిస్తుంది. మరి కొన్ని సార్లు మాత్రం ఈయనేంటి ఇలా అని అదోలా చూసేలా ఆయన వైఖరి ఉంటుంది.

 

ఇపుడు దేశమంతా కరోనా మంటలు పెడుతోంది. అయితే అది మంట కాదు, జస్ట్ చిన్న జ్వరం మాత్రమేనని ఎవరైనా అనగలరా. జగన్ మాత్రం అనేస్తున్నారు. ఒకసారి కాదు పది సార్లు అంటున్నారు. ఓ వైపు ప్రజల ప్రాణాలతో ముడిపడిన అతి పెద్ద ప్రమాద‌కరమైన మహమ్మారి కరోనా వైరస్. దాని విషయంలో జగన్ ఆలోచించి మాట్లాడుతున్నారా అని మేధావులు సైతం నొసలు చిట్లిస్తున్నారు.

 

ఎందుకంటే వైద్య‌ శాస్త్రంలో  తలపండిపోయిన వారి ఎవరికీ అర్ధం కాని బ్రహ్మ పదార్ధంగా కరోనా వైరస్ ఉంది. మరి దాన్ని జగన్ ఏంటి చాలా సింపుల్ గా తీసిపారేస్తున్నారు అని అపుడే విపక్షం వితండవాదం  చేస్తోంది. అయితే మానసిక వైద్య నిపుణులు, వైరస్ గురించి లోతైన పరిశోధన చేసిన వారు మాత్రం జగన్ అన్నదాంట్లో తప్పులేదని అంటున్నారు.

 

కరోనా వైరస్ అంటే పూర్తిగా  మరణం కాదు. అది ఎవరూ చెప్పనక్కరలేదు. ప్రపంచంలో కరోనా సోకిన కేసులు మరణాల నిష్పత్తి తీసుకుంటే సులువుగా ఎవరికైనా అర్ధమవుతున్న సంగతే. ఇక ఈ వైరస్ జ్వరం అని జగన్ అటున్నారు. వైరస్ అంటేనే వేడి చేసేది, మనిషిని అతలాకుతలం చేసేది. రెగ్యులర్ గా బాడీలో జరిగే శ్వాస వంటి ప్రక్రియలను ఇబ్బంది పెట్టేది. అంతకు మించి  ప్రాణం తీయడం అంటే అది కరోనా వల్ల కానే కాదు.

 

అది కూడా వైద్య నిపుణులే అంటున్నారు. ఎలా అంటే కరోనా వైరస్ ముసలి వాళ్ళకు వస్తే వారికి మామూలుగానే పోరాడే రోగ నిరోధక శక్తి ఉండదు, దాంతో కరోనా అక్కడ జయిస్తుంది. అలాగే అప్పటికే రోగులుగా అంటే బీపీ, సుగర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వాటితో ఇబ్బంది పడితే వారికి కూడా కరోనా కబలిస్తుంది. 

 

జగన్ ఇదే విషయాన్ని చెబుతూంటే మాత్రం విపక్షం జగన్ కి ప్రాణాలు లెక్కలేవా అంటోంది. జగన్ ఉన్నది ఉన్నట్లు చెబుతున్నారు. పైగా ఆయన ప్రచారం చేసుకోవడం లేదు. కరోనాపై యుధ్ధం అంటూ చంద్రబాబు టైపులో హుదూద్ ని ఆపేస్తాను, సముద్రాన్ని వెనక్కు నెట్టేస్తాను అంటూ భారీ డైలాగులు చెప్పడంలేదు. మరి ఆ డ్రామాలకు  డైలాగులకు  అలవాటు పడిన వారికి జగన్ అసలు నచ్చడు. ఎందుకంటే జగన్ చెప్పేది నిజం కాబట్టి.

 

నిజంగా కరోనా వైరస్ ప్రమాదమే. అది ఎవరికో  కూడా జగన్ చెబుతున్నారు. జాగ్రత్తగా  ఉండమంటున్నారు. అలాంటి వారి కోసం అన్ని రకాల చర్యలనూ ప్రభుత్వం తీసుకుంటోంది. ఇంట్లోనే ఉండండి అంతా అని కూడా జగన్ చెబుతున్నాడు. దాన్ని పచ్చ మీడియా  గట్టిగా ప్రచారం చేయదు కదా. ఇక కరోనా రోగుల పట్ల ప్రేమ పంచండి అని జగన్ అంటే అది కూడా తప్పుగా తోస్తోంది మరి . ఏమైనా బాబు టైపు డ్రామాలను చూసిన జనాలు కూడా ఇదేంటి జగన్ ఇలా అనుకుంటే ఆ తప్పు బాబుదే మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: