అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓడిపోవడానికి ఇప్పుడు కరోనా వైరస్ కారణం కానుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో ట్రంప్ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అమెరికాలో ఇప్పుడు రెండు లక్షల మంది వరకు బాధితులు ఉన్నారు. వారిలో ఆరు వేల మంది మాత్రమే కోలుకున్నారు. ఒక పక్క కరోనా వైరస్ విస్తరిస్తున్నా సరే ఆయన మాత్రం చాలా రోజుల పాటు లాక్ డౌన్ ని మాత్రం ప్రకటించే ప్రయత్నం చేయలేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అన్ని రాష్ట్రాలకు విమానాలు చాలా స్వేచ్చగా తిరిగాయి. 

 

ఇటలీ నుంచి విమానాలు ఎక్కువగా అమెరికా వరకు వచ్చాయి. కాని ట్రంప్ మాత్రం వాటిని ఆపడానికి ఇష్టపడలేదు. ఆర్ధికంగా ఇబ్బంది లేని తరుణంలో కూడా లాక్ డౌన్ ప్రకటించకుండా ట్రంప్ సమయం వృధా చేసారు. దీనితోనే అక్కడ కరోనా బాధితుల సంఖ్య అనేది రోజు రోజుకి పెరిగిపోయింది అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ పేరు వింటే అమెరికా ఆగ్రహంగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆయన చేతగాని తనమే ఇప్పుడు కరోనా వైరస్ దేశంలో విస్తరించడానికి కారణమని అంటున్నారు. 

 

అందుకే ఆయన కచ్చితంగా ఈసారి ఓడిపోవడం ఖాయమని పలువురు అంటున్నారు. అమెరికన్లు ఆయనను ఏ నమ్మకం తో అయితే అమెరికా అధ్యక్షా పీఠం మీద కూర్చోబెట్టారో ఇప్పుడు అదే నమ్మకం ట్రంప్ కాపాడుకోవడం లో ఘోరంగా విఫలం అయ్యారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలో ఘోరంగా విఫలం అయ్యారని అంటున్నారు అక్కడి ప్రజలు. అమెరికా ప్రజలు ఇప్పుడు ఆయన మీద ఆగ్రహంగా ఉండటానికి ప్రధాన కారణం ఇదే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ ని అమెరికా వద్దు అనడానికి ప్రధాన కారణం ఇదే అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: