అమెరికా మీద భారతీయులు ఎక్కువగా ఆధారపడతారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ కూడా మన మీద ఎక్కువగా ఆధారపడుతుంది అనేది కూడా ఎవరూ కాదనలేని వాస్తవం. అమెరికా ఆర్ధిక వ్యవస్థను పటిష్ట పరచడంలో ఇక్కడి ప్రజల పాత్ర ఎంతో ఉంది. ఐటి కంపెనీల విషయంలో అయినా పరిశ్రమల స్థాపనలో అయినా ఏది అయినా సరే అమెరికా ప్రజలకు మన వాళ్ళు అండగా నిలిచారు. అందుకే కీలక బాధ్యతల్లో మన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అక్కడి ప్రభుత్వంలో కూడా మన వాళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది. 

 

అమెరికా అధ్యక్ష భవనంలో మన వాళ్ళు కీలక పాత్రలు పోషిస్తూ ఉంటారు. అలాంటి అమెరికాలో ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం. అమెరికా అధ్యక్ష భవనంలో కీలక పాత్రల్లో ఉన్న భారతీయులు కూడా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళండి అంటూ భారత ప్రభుత్వానికి వాళ్ళు ఎక్కువగా విజ్ఞప్తి చేస్తున్నారు. అమెరికాలో మేము ఉండలేము మళ్ళీ వచ్చేది లేదని స్పష్టంగా చెప్తున్నారు. ఇక అమెరికాలో ఇప్పుడు ఆర్ధిక మాంద్యం దిశగా పరిస్థితులు వెళ్తున్నాయి. 

 

అమెరికా ఆర్ధిక పరిస్థితి ఇబ్బంది పడితే మాత్రం మన వాళ్ళు మాత్రం కచ్చితంగా ఉద్యోగాలు కోల్పోతారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఆరు నెలల పాటు లాక్ డౌన్ విధించినా ఆశ్చర్యం లేదు. దీనితో అక్కడ ఉద్యోగాలు కోల్పోతే మాత్రం ఉండటానికి అర్హులు కాదు. దీనితో ఇప్పుడు తమను అమెరికాలో ఉండటానికి ఆరు నెలల పాటు అమెరికా లో ఉంచాలని కోరుతున్నారు. మరి దీనిపై అమెరికా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. అక్కడ మన భారతీయులు హెచ్ 1 బీ తో ఉద్యోగాలు చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: