ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లో విస్తరిస్తున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా విఫలం అవుతుంది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా సరే వారి నుంచి ఇప్పుడు దేశం మొత్తానికి కరోనా వైరస్ సోకుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వాళ్ళ నుంచి కరోనా విస్తరిస్తుంది. దాదాపు ఆరు జిల్లాలు వారి ద్వారా ఇబ్బంది పడుతున్నాయి అనేది వాస్తవం. బయటకు రావడం లేదు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని బయటకు తీసుకు రావడంలో ఘోరంగా విఫలం అయింది. 

 

దీనితో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తమ బృందాలను పంపే యోచనలో కేంద్రం ఉంది. ఢిల్లీ నుంచి ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఆంధ్రప్రదేశ్ లో దిగినట్టు సమాచారం. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళు తిరిగి ఇప్పుడు పరిస్థితిని అంచనా వెయ్యాలని భావిస్తున్నాయి. పశ్చిమ గోదావరి, ప్రకాశం, కర్నూలు, సహా పలు జిల్లాలలో కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నారు. కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడే కట్టడి చేయకపోతే రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. 

 

ఆ ప్రభావం క్రమంగా దేశం మీద పడుతుంది. అందుకే కేంద్రం ఇప్పడే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చెయ్యాలని భావిస్తుంది. ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలు పని కూడా చేస్తున్నాయి అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. వెంటనే కరోనా కేసులు కట్టడి కాకపోతే రాష్ట్రం మొత్తం విస్తరిస్తే వైద్య సదుపాయాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేవు. మళ్ళీ వాళ్ళను ఇతర రాష్ట్రాలకు పంపి చికిత్స చెయ్యాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయంలో దృష్టి పెట్టింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: