బుధవారం సాయంత్రం జనాలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత అందరికీ ఓ విషయం అర్ధమైపోయుంటుంది. అదేమిటంటే కరోనా వైరస్ విషయంలో మాట్లాడిన తీరు చంద్రబాబునాయుడును బాగా హర్ట్ చేసి ఉంటుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే వైరస్ విషయంలో చంద్రబాబు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి జనాలను వాయించేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ప్రపంచ దేశాల్లోని జనాభాపై  వైరస్ ఏ స్ధాయిలో ఎంతటి ప్రభావం చూపుతోందో గ్రాఫ్ లు వేసి మరీ చూపిస్తున్నాడు.

 

అలాంటి వైరస్ ఎంత భయంకరంగా వ్యాపిస్తోందో జనాలపై ఎంత తీవ్రంగా దాడి చేస్తోందో భయం కలిగేట్లు వీడియోలు వేసి మరీ చెబుతున్నాడు.  ఇందుకే తాను కూడా గడచిన 15 రోజులుగా తన ఇంట్లో నుండి అసలు బయటకే రావటం లేదులేండి.  మొత్తానికి వైరస్ వ్యాప్తి, ప్రమాదం విషయంలో డాక్టర్, శాస్త్రజ్ఞుడి అవతారమో ఎత్తి జనాలను రోజు భయపెట్టేస్తున్నాడు.

 

ఇక జగన్ విషయానికి వస్తే  బుధవారం మాట్లాడుతు కరోనా వైరస్ అసలు ప్రమాదకరమే కాదని కొట్టిపడేశాడు. మిగితా వైరస్ల కన్నా కాస్త ప్రమాదకరం మాత్రమే కరోనా అంటూ చాలా లైటర్ వేన్లో చెప్పేశాడు. దీని గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కాకపోతే  ప్రతి ఒక్కళ్ళు తగినంత ముందు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పాడు. వైరస్ లక్షణాలను వివరించి ఎవరికైనా అనుమానాలుంటే వెంటనే ఆసుపత్రులకు వచ్చి చెక్ చేసుకోవాలని సూచించాడు.

 

వైరస్ సోకిన వాళ్ళకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లను చేసింది కాబట్టి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాడు. అలాగే వైరస్ ను ఎదుర్కోవటానికి, రోగులకు అందిన వైద్యాన్ని కూడా వివరించి చెప్పాడు. చూశారా కరోనా వైరస్ విషయంలో జగన్ మాటలకు చంద్రబాబు మాటలకు ఎంత తేడా ఉందో. ఒకవైపు తానేమో జనాలందరినీ భయపట్టేస్తుంటే జగన్ మాత్రం పెద్ద సమస్యే కాదన్నట్లుగా మాట్లాడుతుంటే మరి చంద్రబాబుకు ఒళ్ళు మండిపోదా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: