ప్రపంచమంతా తననే ఫాలో అవ్వాలని అగ్రరాజ్యం అమెరికా కోరుకుంటుంది. కానీ ఇపుడు సీన్ రివర్సయి అమెరికాయే ఇతర దేశాలను ఫాలో అయ్యే పరిస్ధితికి దిగిపోయింది. ప్రపంచ దేశాలను వణికించేస్తున్న కరోనా వైరస్ అమెరికా మీద కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వైరస్ ను మొదట్లో నిర్లక్ష్యం చేసిన పాపానికి ఇపుడు యావత్ దేశం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ఒకవైపు లక్షల్లో  పెరిగిపోతున్న బాధితుల సంఖ్య. అదే సమయంలో వేలల్లో పెరిగిపోతున్న మృతుల సంఖ్య. మొత్తానికి రోగులను తట్టుకోలేక చివరకు అమెరికా కూడా ఇటలీ మార్గంలోనే నడుస్తోంది.

 

ఇంతకీ ఏ విషయంలో అమెరికాకు ఇటలీ మార్గదర్శనం చేస్తోంది. ఎందులో అంటే కరోనా వైరస్ రోగులకు ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో. ఒకేసారి ఆసుపత్రులకు వస్తున్న వైరస్ బాధితుల్లో ఎవరికి బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని ముందు డాక్టర్లు పరీక్షిస్తున్నారు. వారిలో బతికే అవకాశాలున్నాయని అనుకున్న వారిని మాత్రమే ఆసుపత్రుల్లో చేర్చుకుని మిగిలిన వారిని చికిత్స చేసి బయటకు పంపేస్తున్నారు అమెరికాలో.

 

వయస్సయిపోయిన వారు, యువకులు, పిల్లలు, వైరస్ సమస్య కాకుండా అప్పటికే ఇతరత్రా అనారోగ్యాలతో బాధపడుతున్నవారిగా రోగులను వర్గీకరిస్తున్నాయట ఆసుపత్రులు. పై నాలుగు క్యాటగిరిల్లో ఎవరికైతే బతికే అవకాశాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారిస్తారో వాళ్ళనే ఇన్ పేషంట్లుగా చేర్చుకుంటున్నారు. మిగిలిన వాళ్ళకి చికిత్సలు చేసి బయటకు పంపేస్తున్నారు. పై ఫొటో లాస్ వేగాస్ లోని ఓ కార్ పార్కింగ్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్. వాళ్ళందరికీ వైద్యులు చికిత్సలు చేసి పంపేశారు.

 

ఆసుపత్రులు రోగుల విషయంలో ఎందుకు ఇటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాయి ? ఎందుకంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా చేర్చుకునేందుకు ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు లేవు కాబట్టే. ఈ పద్దతి దాదాపు రెండు వారాలుగా ఇటలీ ప్రభుత్వం అనుసరిస్తోంది. ఎందుకంటే అక్కడ కూడా రోజుకు కొన్ని వందల మంది వైరస్ సమస్యతో ఆసుపత్రులకు వచ్చేస్తున్నారు. వాళ్ళందరినీ చేర్చుకునే అవకాశాలు లేక పై విధానాన్ని ఆచరణలో పెట్టింది. ఇపుడు ఇదే పద్దతిని అమెరికా కూడా అనుసరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: