క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను అత‌లా కుత‌లం చేస్తోంది. ఎన్ని క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను సైతం క‌రోనా క‌మ్మేస్తుంది. కరోనా వైరస్ నియంత్రణ అదుపులో వుంది అనుకుంటున్న తరుణంలో.. ఢిల్లీ దెబ్బ ఏపీపై పడింది. దీంతో  గత రెండు రోజలుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం బాధ కలిగించే అంశమని బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారిలోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

ఈ క్ర‌మంలోనే ఏపీలోనూ 87 కేసులు నమోదయ్యాయని.. అయితే ఇందులో 70 కేసుల్లో ఢిల్లీలో మర్కజ్‌లో పాల్గొన్నవారే ఉన్నారని వివరించారు జగన్‌. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుమారు 1085 మంది నిజాముద్దీన్‌కు వెళ్లారని.. అందులో 585 మందికి పరీక్షలు నిర్వహించామని సీఎం చెప్పారు. వీటిల్లో 70 కేసులు పాజిటివ్‌గా వచ్చాయని.. మరో 500 కేసులు పరీక్షలకు పంపామని పేర్కొన్నారు. అలాగే ఇంకా 21 మంది జాడ ఇంకా గుర్తించాల్సి ఉందని సీఎం జగన్ ప్రకటించారు. 

 

వారు ఎవరు? ఏ జిల్లాకు చెందినవారు, ఎక్కడెక్కడ తిరిగారు? అనే వివరాలను తెలుసుకోవడం ఇప్పుడు అధికారుల ముందున్న తక్షణ కర్తవ్యం. ఆ 21 మందిని వీలైనంత త్వరగా గుర్తించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి రెవిన్యూ యంత్రాంగాన్ని ఇప్పటికే ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను వినియోగించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వీలైనంత త్వరగా గుర్తించాలని సూచించారు. దీంతో ప్ర‌స్తుతం ఏపీ అధికారుల్లో టెన్ష‌న్ నెల‌కొంది. ఎందుకంటే, గ‌తంలో దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి ద్వారా 57వేల మందికి కరోనా సోకింది. మ‌రి ఏపీలో ఈ 21 మంది ద్వారా ఇంకెంత మందికి వైర‌స్ సోకుందో అని ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

applehttps://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: