ప్రపంచం మొత్తాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ కొందరికి మేలు కూడా చేయబోతోందా ? అంటే అవననే చెప్పాలి. వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచదేశాల్లోని అనేక రంగాలు కుదేలైపోయిన విషయం అందరికీ తెలిసిందే. మూతపడిపోయిన రంగాల్లో పారిశ్రామిక రంగం కూడా ఉంది. ఇందులో కూడా మోటారు వాహనాల తయారీ పరిశ్రమల గురించి చెప్పనే అవసరం లేదు. ఇందులో మనదేశంలోనీ హీరో  మోటార్ కార్ప్ కూడా ఒకటి.

 

దేశంలో టూవీలర్ల వినియోగదారులు కోట్లలో ఉన్నారు. ప్రతి ఏడాది మార్కెట్లోకి వచ్చే టూవీలర్లను కొనుగోలు చేయాలని ఎదురు చూసే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. అందుకే టూ వీలర్ తయారీ సంస్ధలు ఎప్పటికప్పుడు యూత్ ఆలోచనల ప్రకారం కొత్త కొత్త డిజైన్లలో టూ వీలర్లను తయారు చేస్తున్నాయి. ఇలాంటి సంస్ధల్లో హీరో మోటారు కార్ప్ కూడా ఒకటి.

 

ఈ కంపెనీ ఇపుడు తన వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేమిటంటే మోటారు సైకిళ్ళపై రూ. 10 వేలు, స్కూటర్లపై 15 వేల రూపాయలు తగ్గించినట్లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లాక్ డౌన్ కారణంగా యావత్ దేశం దాదాపు మూత పడిపోయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హీరో మోటార్ కార్ప్ ఉత్పత్తి యూనిట్లతో పాటు షోరూములను కూడా మూసేశారు. దాంతో ప్రొడక్షన్ ప్లాంట్లతో పాటు షో రూముల్లో కూడా లక్షలాది టూ వీలర్లు ఉండిపోయాయి.

 

అసలింతకీ విషయం ఏమిటంటే హీరో కంపెనీ దగ్గర బిఎస్-4  టైప్ టూ వీలర్లు సుమారు 1.5 లక్షలుండిపోయాయి. వీటి విలువ రూ. 600 కోట్లుటుంది. అలాగే ఫెడరేష్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అంచనా ప్రకారం దేశం మొత్తం మీద టూ వీలర్ల డీలర్ల దగ్గర సుమారు 7 లక్షల బళ్ళు ఉండిపోయాయి. అమ్ముడుపోకుండా షో రూముల్లోనే ఉండిపోయిన వాటి విలువ సుమారు రూ. 3800 కోట్లుంటుంది.

 

పైగా 2020, ఏప్రిల్ 1 నుండి బిఎస్-4 వాహనాలను అమ్మటం, రిజిస్ట్రేషన్ ను సుప్రింకోర్టు నిషేధించింది. లాక్ డౌన్ కారణంగా కొంత గడువు పొడిగించినా మొత్తం మీద నిషేధం అయితే వాస్తవం. దాంతో అమ్ముడుపోకుండా నిలిచిపోయిన వాహనాలను వదిలించుకోవటానికి కంపెనీ డిస్కౌంట్లు ఇస్తోందన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: