కరోనా కష్టకాలంలో కేంద్రం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. దేశంలో ఈఎంలు కట్టాల్సిన వాళ్లంతా మూడు నెలలు కట్టాల్సిన అవసరం లేదని ఇటీవల ప్రకటించింది. అయితేఈ ప్రకటనపై చాలా గందరగోళం నెలకొంది. ఈ మారటోరియం అన్ని బ్యాంకులకూ వర్తిస్తుందా.. లేదా కొన్ని బ్యాంకులకేనా.. ఈ మారటోరియం కోసం ఖాతాదారులు ఏంచేయాలి.. ఏమీ చేయకపోతే ఈఎంఐ కట్ అవుతుందా.. ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి.

 

 

అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ఇప్పటికే మారటోరియం అందిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రకటించేశాయి. అయితే ప్రైవేటు బ్యాంకులు కూడా ఇప్పుడు ఇదే మాట చెబుతున్నాయి. కాకపోతే మారటోరియం కావాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. మారటోరియం వద్దనుకునేవాళ్లు బ్యాంకుకు తెలియజేయాలనే ఐచ్ఛికాన్ని పీఎస్‌బీలు అందించాయి. కావాలనుకునేవాళ్లు బ్యాంకులను సంప్రదించాలనే ఆప్షన్ ఇచ్చాయి.

 

 

ఈ అంశంపై ప్రేవేటు బ్యాంకులు ఏమంటున్నాయో చూద్దాం.. ఈఎంఐపై మారటోరియం అవసరం లేనివారు తమను సంప్రదించాల్సిన అవసరం లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించింది. మారటోరియం కావాలనుకునేవాళ్లు మాత్రం ఈమెయిల్‌ చెయ్యాలని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రకటించింది. ఇందుకోసం ఓ మెయిల్‌ ఐడీని కూడా ఇచ్చింది. అయితే మారటోరియం కాలానికి వడ్డీని వసూలు చేస్తామని ఆ బ్యాంకు తెలిపింది.

 

 

ఇక ఐసీఐసీఐ శాలరీ ఎంప్లాయ్స్ కు ఆప్ట్‌-ఇన్‌ సదుపాయం కల్పించింది. బిజినెస్ మెన్ మాత్రం ఆప్ట్‌-ఔట్‌ సదుపాయం ఇచ్చింది. ఈ అంశంపై ఒక్కో బ్యాంకు ఒక్కోలా స్పందిస్తున్నందువల్ల మీరు మీ బ్యాంక్ వెబ్‌సైట‌్ ను ఫాలో అవ్వండి అందులోని సూచనల ప్రకారం నడుచుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: