దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1637కు చేరింది. వీరిలో 38 మంది మృతి చెందగా 150 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గత రెండు రోజుల నుంచి భారీగా కేసులు నమోదవుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కూడా భారీగా కరోనా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. 
 
తమిళనాడు రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ విషయాలను వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 234కు చేరింది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నట్లు తేలింది. ఒక్కరోజులోనే 110 కొత్త కేసులు నమోదయ్యాయంటే తమిళనాడులో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు, 
 
తమిళనాడులోని దిండిగుల్, తేని, కోయంబత్తూర్, మధురై, శివగంగ, తిరునెవేలి, తూత్తుకుడి జిల్లాలకు చెందినవారే ఎక్కువ మంది కరోనా భారీన గమనార్హం. తమిళనాడు అధికారులు బాధితులంతా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే అని తెలిపారు. ఒకేరోజు 110 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి వివరాలను సేకరించి క్వారంటైన్ కు తరలిస్తోంది. 
 
మరోవైపు ఏపీలో నిన్న ఒక్కరోజే 43 కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్రంలో కఠినంగా అమలు చెస్తోంది. కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఏపీలో ఇప్పటివరకూ 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తెలంగాణలో 97 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: