కరోనా దెబ్బకు భారతదేశం మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం నిదానంగా పెరుగుతున్న సమయంలోనే ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఇక ఆ కర్ఫ్యూ తర్వాత, కరోనా కట్టడి చేయాలంటే ఇంకా ఎక్కువ రోజులు ప్రజల స్వీయ నియంత్రణ పాటించాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ విదించారు. దీంతో ఎమర్జన్సీ సేవలు తప్ప, అన్నీ సేవలు నిలిచిపోయాయి. ఇక ప్రజలు నిత్యావసర వస్తువులు, కూరగాయలు తెచ్చుకునేందుకు కొంత సమయం కేటాయించారు.

 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లాక్ డౌన్ కఠినంగా అమలవుతుంది. అలాగే నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు ప్రత్యేక సమయం కేటాయించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఎప్పుడు బయట తిరిగేవారు ఇంట్లో ఉండలేక కష్టపడుతున్నారు. అటు మందుబాబులు కూడా మద్యం దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ కరోనా వల్ల లవర్స్‌కు కూడా కష్టాలు వచ్చాయి.

 

మామూలుగా అయితే లవర్స్...ఫోన్‌లో కాలక్షేపం చేయడంతో పాటు,  ఏ పార్క్‌లోనో, షాపింగ్ మాల్ లోనో, సినిమా హాల్ లోనో, లేదంటే కాలేజీ ఉంటే, అక్కడ కలుసుకునే వారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ ఉండటంతో, బయటకు వెళ్ళడం కుదరదు. దీంతో కేవలం ఫోన్‌లోనే గడపాల్సిన పరిస్తితి ఉంది. అయితే మరి గాఢ ప్రేమికులు మాత్రం తమ లవర్‌ని కలుసుకోవాలని తహతహలాడుతున్నారు. కానీ ఆ సౌకర్యం లేకపోవడంతో, ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా తమ ఫ్రస్టేషన్ చూపిస్తున్నారు.

 

ముఖ్యంగా టిక్‌టాక్ వేదికగా విరహ గీతాలతో డ్యూయెట్‌లు చేస్తున్నారు. మరి కొందరు అయితే కామెడీగా తమ లవర్‌ని చూడాలంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా కరోనా వల్ల లవర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్ ఎప్పుడవుతుందా? అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మొత్తానికైతే కరోనా వల్ల లవర్స్ కూడా కష్టాలు నానా కష్టాలు పడుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: