ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాను అతలాకుతలం చేస్తున్నది.  ఇప్పటికే ఈ వైరస్ కారణంగా దేశంలో 1711 కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే 250 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.  లాక్ డౌన్ చేసి, నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కరోనా విలయతాండవం మాత్రం తప్పడం లేదు.  కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన చెందుతున్నది.   ఒక్కరోజే 15 మరణాలు సంభవించాయి.  దీంతో మొత్తం ఇండియాలో 54 మంది మరణించారు. మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఇండియా ఆందోళన చెందుతున్నది.  

 

చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ అనతి కాలంలోనే ప్రపంచ దేశాలకు వ్యాపించింది.   ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో అనేక మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. ఇక అమెరికాలో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. అమెరికా నుంచి ఇంగ్లాండ్ వరకు ఎక్కువగా కరోనా కేసులు  నమోదు అవుతున్నాయి. 

 

1. అమెరికా 1,88,639

2. ఇటలీ 1,05,792

3. స్పెయిన్ 1,02,136

4. చైనా 81,554

5. జర్మనీ 72,383

6. ఫ్రాన్స్ 52,128

7. ఇరాన్ 47,593

8. బ్రిటన్ 25,150

9. స్విట్జర్‌లాండ్ 16,605

10. బెల్జియం 13,964

 

ఎక్కువగా కరోనా మరణాలు నమోదైన దేశాలు

1. ఇటలీ 12,428

2. స్పెయిన్ 9,053

3. అమెరికా 4,059

4. ఫ్రాన్స్ 3,523

5. చైనా 3,312

6. ఇరాన్ 3,036

7. బ్రిటన్ 1,789

8. నెదర్లాండ్స్ 1,039

9. బెల్జియం 828

10. జర్మనీ 788

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: