ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా క‌రోనా మ‌హమ్మారితో ప్ర‌జ‌లంతా హ‌డ‌లెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం వినాల్సి వ‌స్తుందో..ఏ మూల ఏం జ‌రుగుతుందో అర్దం కావ‌డం లేదు. ఈ వ్యాధి బారిన ప‌డిన‌వాళ్ళు రిక‌వ‌రీ అయిన వాళ్ళు చాలా త‌క్కువ మంది అని చెప్పాలి. వ్యాధి బారిన ప‌డిన దాదాపు చాలా మంది ప్ర‌జ‌లు మృత్యువాత‌ప‌డుతున్నారు. మ‌రి ఈ వ్యాధి బారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒక మ‌నిషి నుంచి మ‌రో మ‌నిషికి క‌నీస దూరం పాటించాలంటున్నారు. ఈ వ్యాధి అంటువ్యాధి కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ శ‌రీర ప‌రిశుభ్ర‌త చాలా ముఖ్య‌మ‌ని వైధ్యులు, శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు. ఇక ఈ మ‌హ‌మ్మారిని పాల‌ద్రోల‌డానికి ప్ర‌స్తుతం అంద‌రూ లాక్‌డ‌వున్‌లో ఉన్నారు. ఎవ్వ‌రూ కూడా వారి వారి విధుల‌కు వెళ్ళ‌కుండా సెల‌బ్రెటీల నుంచి సామాన్యుల వ‌ర‌కు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ నేప‌ధ్యంలో క‌నీస అవ‌స‌రాల‌కు త‌ప్పించి దేనికి బ‌య‌ట‌కు ప్ర‌జ‌లు రావ‌డం లేదు. 

 

ఇక ఇదిలా ఉంటే...ఇటీవ‌లె ఢిల్లీ మ‌త‌ప్రచారం కొర‌కు కొంత మంది మ‌త పెద్ద‌లు వ‌చ్చి అక్క‌డ ప్రార్ద‌లు చేయ‌గా వేరే వేరే ప్ర‌దేశాల నుంచి అక్క‌డికి చాలా మంది ముస్లిమ్‌లు వెళ్ళారు. మ‌రా దాంతో అక్క‌డ ఉన్న వారిలో ఈ వ్యాధి ఎవ‌రికి ఉందో తెలియ‌దు కానీ అక్క‌డ‌కి వెళ్ళి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి ఈ వ్యాధి సోకి ఇప్ప‌టికే కొంత మంది మ‌ర‌ణించారు. ఇక మిగ‌తావారంద‌రికి కూడా దాదాపు పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌ధ్యంలో మ‌రికొంత మంది ఈ వ్యాధి సోకిన‌ప్ప‌టికీ బ‌య‌ట‌కు రాకుండా చెప్ప‌కుండా గోప్యంగా ఉంచుతున్నారు. మ‌రి ఈ ర‌క‌మైన ప‌నులు ఎంత మాత్రం మంచిది కాద‌ని ఒక‌సారి వారికి వారే ఆలోచించుకోవాలి. ఎందువ‌ల్ల‌నంటే ఇది కేవ‌లం మ‌న ఒక్క‌రితో పోయే వ్యాధి కాదు. మ‌న‌తో పాటు మ‌న కుటుంబ స‌భ్యులు, చుట్టుప్ర‌క్క‌ల‌వాళ్ళు..చివ‌రికి దేశాన్నే మింగేసే వ్యాధి ఇది. కాబ‌ట్టి మ‌న‌మే మాన‌వ‌తా దృక్ప‌ధంతో ముందుకు వెళ్ళి వైద్యం చేయించుకుంటే చాలా మంచిది. 

 

ఇక ఈ విష‌యం పై ఎవ‌రైనా దాచిపెట్టినా వారి ఇంట్లోవారు క‌నీసం ధ‌ర్మంగా దీనిని తీసుకుని క్వారంటెయిన్‌కి పంపిస్తే చాలా మంచిది అయితే కానీ ఏ కుటుంబంలో కూడా ఒక్క‌రు వెళ్ళివ‌చ్చినా వారికి మిగిలిన వారు చెప్ప‌లేక‌పోవ‌చ్చు. ఎందువ‌ల్ల‌నంటే ఇక్క‌డ బంధాలు..అనుబంధాలు కూడుకుని ఉంటాయి. కాద‌ని కాదు కానీ ఈ వ్యాధి అలాంటిది కాబ‌ట్టి మ‌నం దీనికి త‌గిన చ‌ర్య‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవ‌డం అనేది చాలా ముఖ్యం. కేవలం రెండు వారాలు బంధాన్ని తెంచుకుంటే.. అంటే అని అన్న‌కావొచ్చు, తండ్రి కావొచ్చు మ‌రింకెవ్వ‌రైనా కావొచ్చు..వెళ్ళి చెక్ చేయించుకుని దానికి త‌గిన వైద్యం తీసుకుంటే  జీవితాంతం ఆ ర‌క్త సంబంధం నిల‌బ‌డుతుంది...తెలిసి తెలిసి త‌ప్పు చేస్తే మ‌న‌మే కాదు మ‌న‌తో పాటు చాలా ప్రాణాలు బ‌లైపోతాయ‌న్న విష‌యం గుర్తుంచుకుంటే బావుంటుంద‌ని చాలా వైధ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: